పుట్టేది ఏ బిడ్డో.. పులి తేల్చేసింది.. ఇదేం ఆటరా నాయనా అంటున్న నెటిజనం.. తెలుసుకుంటే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2021-10-13T03:41:35+05:30 IST

దుబాయ్ వంటి దేశాల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు ఉంటాయంటే మీరు నమ్ముతారా.. అవును ఇది నిజం. గర్భిణిగా మహిళకు పుట్టేది ఏ బిడ్డో తెలుసుకునేందుకు.. వారు ఓ క్రీడ నిర్వహిస్తుంటారు.

పుట్టేది ఏ బిడ్డో.. పులి తేల్చేసింది.. ఇదేం ఆటరా నాయనా అంటున్న నెటిజనం.. తెలుసుకుంటే అవాక్కవుతారు..

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జనం మూఢ నమ్మకాలపై ఆధారపడి జీవిస్తుంటారు. మారుమూల గ్రామాల్లో ఎక్కువగా ఇలాంటి ఆచారాలను మనం చూస్తుంటాం. అయితే దుబాయ్ వంటి దేశాల్లోనూ ఇంకా మూఢనమ్మకాలు ఉంటాయంటే మీరు నమ్ముతారా.. అవును ఇది నిజం. గర్భిణిగా మహిళకు పుట్టేది ఏ బిడ్డో తెలుసుకునేందుకు.. వారు ఓ క్రీడ నిర్వహిస్తుంటారు. దాని ఆధారంగానే పుట్టేది మగబిడ్డా.. లేక ఆడబిడ్డా అనేది నిర్ణయిస్తారట. చూడ్డానికి వింతగా ఉన్న ఈ క్రీడను వారు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. 


గర్భిణిగా ఉన్న ఇంటి వారు.. వారి బంధువులు, సన్నిహితులను పిలిచి ఓ క్రీడ నిర్వహిస్తారు. కొన్ని బెలూన్లను వేలాడదీస్తారు. కొన్నింట్లో పింక్ కలర్ నింపుతారు.. మరి కొన్నింటిలో బ్లూ కలర్ నింపుతారు. వచ్చిన బంధువుల్లో ఎవరో ఒకరితో బెలూన్ పగులగొట్టిస్తారు. అందులో పింక్ కలర్ వస్తే పుట్టేది అమ్మాయి అనీ.. బ్లూ వస్తే అబ్బాయి అని నమ్ముతారు. ఇదీ ఆట. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఓ పులిని బరిలోకి దింపి, దానితో బెలూన్‌ను పగులగొట్టించడమే విశేషం.


దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్ పక్కన ఉన్న బీచ్‌లో బెలూన్లను ఎగురవేశారు. అప్పుడే ఓ పులి అక్కడికి ఎంటర్ అవుతుంది. ఒక్కసారిగా పైకి ఎగిరి ఓ బెలూన్‌ను పగులగొడుతుంది. అందులో నుంచి పింక్ కలర్ బయటకు వస్తుంది. అంటే పుట్టేది ఆడపిల్ల అని ఆ పులి తేల్చేసిందన్న మాట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆట ఏంటో.. ఏ పిల్లలు పుట్టేది.. పులి డిసైడ్ చేయడమేంటో.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Updated Date - 2021-10-13T03:41:35+05:30 IST