వారు ఆడిందే ఆట... పాడిందే పాట..!

ABN , First Publish Date - 2021-10-25T06:35:06+05:30 IST

జిల్లా వైద్య శాఖలో ఫెవికాల్‌ వీరులు చక్రం తిప్పుతున్నారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేయటమే కాకుండా ఒకే విభాగంలో ఏళ్లుగా ఉంటూ పట్టు సాధించారు.

వారు ఆడిందే ఆట... పాడిందే పాట..!
సెప్టెంబరు నెలలో సీట్ల మార్పునకు వైద్య కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు

వైద్యశాఖలో ఫెవికాల్‌ వీరులు 

ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట  

మూడేళ్లు ఒకే సెక్షనలోనే ఉంటే మార్పు చేయాలని ఉత్తర్వులు 

కమిషనర్‌ ఆదేశాల అమలుపై వెనకడుగు

అనంతపురం వైద్యం, అక్టోబరు24: జిల్లా వైద్య శాఖలో ఫెవికాల్‌ వీరులు చక్రం తిప్పుతున్నారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేయటమే కాకుండా ఒకే విభాగంలో ఏళ్లుగా ఉంటూ పట్టు సాధించారు. ఆ విభాగాల్లో ఏది జరగాలన్న వీరి సూచనలు ఉండాల్సి ందే.  అధికారులు సైతం వారు చెప్పినదానికి తలాడిస్తున్నారనే ప్రచారం ఏళ్లుగా సాగుతోంది. అయితే ఇప్పు డు వైద్యశాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులు జిల్లా వైద్యశాఖ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. జిల్లా వైద్యశాఖ ఆఫీ్‌సలో ఒకే విభాగంలో మూడేళ్లకు పైగా పనిచేసి ఉంటే వారిని వెంటనే మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 9వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయి. నె లన్నర కావొస్తున్నా కమిషనర్‌ ఉత్తర్వులు ఇక్కడ అమలు కాలేదు. దీంతో జిల్లా వైద్యాధికారులు ఆ ఫెవికాల్‌ వీరుల సీట్లను మారుస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కొందరు సీనియర్‌ అసిస్టెంట్లు ఏళ్ల తరబడిగా వైద్యశాఖలో కొనసాగుతూ వస్తున్నారు. కీలకమైన విభాగాలను తమ చేతుల్లో ఉంచుకొని వ్యవహారాలు నడుపుతున్నారు. ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా వారిని వెంటనే ఈ ఫెవికాల్‌ వీరులు తమ అనుభవాలతో బుట్టలో వేసుకుంటున్నారు. ఎ వరికి ఏది కావాలో అది చేసి పెడతారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వైద్యశాఖలో ఎ స్టాబ్లిష్‌ మెంట్‌ విభాగాలు చాలా కీలకం. వైద్య కార్యాలయంతో పాటు నియామకాలు జిల్లాలోని అన్ని పీహెచసీల డాక్టర్లు, నర్సులు, స్టాఫ్‌ నర్సులు ఇతరత్రా అన్ని విభాగాల సి బ్బంది వ్యవహారాలు ఈ విభాగాల చేతిలోనే ఉంటాయి. ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఆయన ఈ ఎస్టాబ్లి్‌షమెంట్‌ విభాగంలో కీలకం గా ఏళ్లుగా ఉంటూ వస్తున్నారు. నియామకాలతో పాటు బదిలీలు, ఇతరత్రా సర్వీస్‌ వ్యవహారాలన్నీ ఈయన చేతుల్లోనే ఉంటున్నాయి. ఈయన ఒకవేళ సీటు మారినా మరో ఏడాదిలోపే మళ్లీ ఇదే విభాగానికి వస్తారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూ స్తున్న విభాగాన్ని దాదాపు పదేళ్లుగా ఈయనే కొనసాగిస్తున్నారని వైద్య రికార్డులు చెబుతున్నాయి. మరో సీనియర్‌ అసిస్టెంట్‌ ఎంపీహెచఈ, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, హెల్త్‌ అసి స్టెంట్లు, హెల్త్‌ సూపర్‌వైజర్ల వ్యవహారాలను దాదాపు ఐదారేళ్లుగా చూస్తున్నారు. ఇటీవల ఏడాదిగా పీహెచసీ వైద్యుల వ్యవహారాలు కూడా ఈయనే చూస్తున్నారు. మరో సీనియర్‌ అసిస్టెంట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లు, డ్రైవర్లు, క్లాస్‌ఫోర్‌ ఉద్యో గుల వ్యవహారాలను ఐదేళ్లుగా చూస్తున్నారు. ఈ ము గ్గురిలో ఇద్దరు ఎనజీఓ సంఘం నేతలు కాగా మరొకరు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతగా కొనసాగుతున్నారు. ఇది కూడా వారు ఇక్కడ కొనసాగడానికి, అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకొని చక్రం తిప్పడానికి ఉపయోగపడిందన్న ప్రచారం జరుగుతోంది. అధికారులు కూడా వారిని ఎదిరించలేని పరిస్థితితో పాటు వారికి అనుకూలంగా అన్ని సర్దుబాటు చేస్తుండటంతో ఫెవికాల్స్‌ది ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే కుష్ఠు విభాగంలో ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ పీఓటీటీ విభాగంలో ఇంకో సీనియర్‌ అసిస్టెంట్‌ కూడా దాదాపు పదేళ్లుగా తిష్టవేసి పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖ కమిషనర్‌ మూడేళ్లు ఒకే సీట్లో పనిచేస్తున్న వారిని మార్పు చేయాలని అందులోనూ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నవారికి ఈ కీలకమైన విభాగాలు అప్పగించాలని ఆ ఉత్తర్వులో ఆదేశించారు. ఇప్పుడు ఈ ఫెవికాల్స్‌ సీట్లు మార్చి ప్రాధాన్యత లేని విభాగాలకు నియమిస్తారా? లేక ఎన్నో ఏళ్లుగా అన్ని అర్హతలూ ఉన్నా పైరవీలు చేసుకోలేక ఏదో ఇచ్చిన సీట్లో కూర్చొని పనులు చేసుకొని వెళ్తున్నవారికి అవకాశం కల్పిస్తారా? అనేది ఇప్పుడు వైద్యశాఖలో చర్చ సాగుతోంది. ఉన్నతాధికారులు దీనిపై మౌనం పాటిస్తూ వస్తున్నారు. వైద్య ఉద్యోగులు మాత్రం ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు.  

Updated Date - 2021-10-25T06:35:06+05:30 IST