పోలీసులు, 50 మంది గ్రామస్తులు.. అడవిలో రెండ్రోజులుగా ఈ యువతి కోసం సెర్చింగ్.. చివరకు ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2021-09-18T21:12:04+05:30 IST

సోదరితో కలిసి బయటికెళ్లిన ఓ 20 ఏళ్ల యువతి.. అకస్మాత్తుగా తప్పిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఆ యువతి జాడను కనిపెట్టేందుకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రోన్ కెమెరా ఆధారంగా యువతిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నమూ ఫలించలేదు. ఈ క్రమంలోనే సుమారు 50 మంది గ్రామస్థులు కూ

పోలీసులు, 50 మంది గ్రామస్తులు.. అడవిలో రెండ్రోజులుగా ఈ యువతి కోసం సెర్చింగ్.. చివరకు ఊహించని ట్విస్ట్..

ఇంటర్నెట్ డెస్క్: సోదరితో కలిసి బయటికెళ్లిన ఓ 20 ఏళ్ల యువతి.. అకస్మాత్తుగా తప్పిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఆ యువతి జాడను కనిపెట్టేందుకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రోన్ కెమెరా ఆధారంగా యువతిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నమూ ఫలించలేదు. ఈ క్రమంలోనే సుమారు 50 మంది గ్రామస్థులు కూడా ఆ యువతిని వెతకడానికి ముందుకొచ్చారు. క్రూరమృగాలబారిన సదరు యువతి పడిందేమో అనే అనుమానంతో అడవిని జల్లెడపట్టారు. అయినప్పటికీ వారి శ్రమ వృథానే అయింది. యువతి జాడ దొరుకుందనే ఆశ వారిలో క్రమంగా సన్నగిల్లింది. ఈ క్రమంలోనే సరిగ్గా నాలుగు రోజులకు.. సదరు యువతి పోలీసుల కంటపడింది. ఈ నేపథ్యంలో విషయం ఆరా తీయగా.. ఆమె చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం ఆమె చెప్పింది ఓ కట్టుకథ అని తెలుసుకుని అందరూ కంగుతిన్న ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి.. తన సోదరితో కలిసి బుధవారం రోజు పక్కనే ఉన్న అడవివైపు వెళ్లింది. అక్కడ తాను చిరుత బారినపడ్డట్టు సీన్ క్రియేట్ చేసి, అకస్మాత్తగా అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన సదరు యువతి సోదరి.. ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు.. పోలీసుల సహకారంతో అడవిలో యువతి జాడను కనిపెట్టేందుకు రంగంలోకి దిగారు.  ఈ క్రమంలోనే రెండు రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ ఆ యువతి జాడ దొరకకపోవడంతో.. గ్రామస్థులు కూడా అడవిని జల్లెడపట్టారు. 



ఈ నేపథ్యంలో యువతి అదృశ్యమై అప్పటికే నాలుగు రోజులు గడచిపోయాయి. ఈ క్రమంలో అల్వార్ సమీపంలోని బస్టాప్‌లో సదరు యువతి పోలీసుల కంటపడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తాను ఓ చిరుత బారినపడి తప్పించుకుని వచ్చినట్టు ఆ యువతి చెప్పడంతో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతి చెప్పింది పచ్చి అబద్ధం అని తేల్చేశారు. యువతిని చిరుత వెంబడించినట్లు ఆధారాలు ఎక్కడా లేవని గుర్తించి, మరోసారి యువతిని నిలదీశారు. 


ఈ క్రమంలో యువతి నిజం చెప్పింది. తనకు చదుకోవాలని ఉందని.. 10వ తరగతి తర్వాత తల్లిదండ్రులు చదువు మాన్పించి, ఇంటికి పరిమితం చేశారని వెల్లడించింది. తన తోబుట్టువులు ఇంటిపనులు చేస్తూనే చదువుకుంటున్నారని.. తాను మాత్రం ఇంటి పనులకే పరిమితమైనట్టు వెల్లడించింది. ఇంటిపనులపై విసుగు చెంది, ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకుని, బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది. అయితే కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి.. తిరిగి ఇంటికి వచ్చినట్లు పేర్కొంది. ఇది విన్న పోలీసులు, కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కాగా.. కూతురి మనసును అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు.. చేసిన పనికి ఆమెపై కోప్పడకుండా చదివించేందుకు అంగీకరించారు. పోలీసులు కూడా సదరు యువతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-09-18T21:12:04+05:30 IST