జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

ABN , First Publish Date - 2022-06-29T07:29:54+05:30 IST

మంగళవారం వెలువడిన ఇంటర్‌ ఫలి తాల్లో బాలికలు సత్తాచాటారు.

జిల్లాలో ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

బాలికలు 75 శాతం, బాలురు 58 శాతం

జిల్లాకు చెందిన బాలికకు రాష్ట్రస్థాయి మార్కులు

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 28 : మంగళవారం వెలువడిన ఇంటర్‌ ఫలి తాల్లో బాలికలు సత్తాచాటారు. రెండో సంవత్సరం 3,444 మంది హాజరు కాగా 2,587 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి శాతం 75 కాగా, బాలురు 6,375 మంది హాజరు కాగా 4,298 మంది 67 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 6,208 హాజరు కాగా 3,798 మంది 61 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 71 శాతం కాగా బాలురు 2,943కు గాను 1471 మంది 49 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ మొదటి సంవ త్సరం 582 మంది ఉత్తీర్ణులై 43 శాతం సాధించారు. ద్వితీయ సంవ త్సరంలో 674 మంది 57 శాతం సాధించారు. నిర్మల్‌ జిల్లాకు చెందిన సాయి అమృత వర్షిణి స్టేట్‌ ర్యాంకు సాధించింది. 

కేజీబీవీలో ఉన్నత ఫలితాలు 94 శాతం ఉత్తీర్ణత

జిల్లాలోని 10 కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు 94 శాతంతో ఉన్నత ఫలితాలు సాధించినట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ద్వితీయ సంవ త్సరం 540 విద్యార్థులు పరీక్ష రాయగా 508 మంది ఉత్తీర్ణత పొం దారు. ప్రథమ సంవత్సరంలో 423 మందిలో 390 సఫలీకృతులయ్యారు. ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను డీఈవో అభినందించారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు రావడం పట్ల హర్షం వ్యక్త పరిచారు. సెక్టోరియల్‌ అధికారి శ్రీదేవి, స్పెషల్‌ అధికారులు పాల్గొన్నారు. 

99 శాతంతో గురుకుల విద్యార్థినుల ఉత్తీర్ణత

సోఫీనగర్‌లోని గురుకుల జూనియర్‌ కళాశాల విద్యార్థిని ధనుష్క ఇంటర్‌ ఫస్టియర్‌లో అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులను కైవసం చేసుకుంది. కాగా.. తమ విద్యార్థిని ధనుష్క రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాశంకర్‌ హర్షం వ్యక్తం చేశారు. అఽ ద్యాపకుల అత్యుత్తమ బోధనతోనే ఇది సాధ్యమైందన్నారు. 

Updated Date - 2022-06-29T07:29:54+05:30 IST