ఇంటర్‌లో బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-06-29T06:16:26+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలు 69.81శాతంతో ముందుండగా, బాలురు 50శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 60.22 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర స్థాయిలో జిల్లా 19వ స్థానంలో నిలిచింది.

ఇంటర్‌లో బాలికలదే పైచేయి
ఇంటర్‌ ఫలితాలు వెలువడటంతో విద్యార్థుల సంబరాలు

6981శాతంతో ముందంజ

జిల్లా ఉత్తీర్ణత శాతం 60.22

ప్రథమ సంవత్సరంలో 57, ద్వితీయంలో 63.3శాతం                            

రాష్ట్రంలో 19వ స్థానం


భువనగిరి టౌన్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలు 69.81శాతంతో ముందుండగా, బాలురు 50శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 60.22 శాతం ఉత్తీర్ణత రాష్ట్ర స్థాయిలో జిల్లా 19వ స్థానంలో నిలిచింది.



జిల్లాలో 66 ప్రభుత్వ, ప్రైవేట్‌, రెసిడెన్షియల్‌ కళాశాలలు ఉండగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 14,011మంది విద్యార్థులు హాజరవ్వగా,8438 (60. 22శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,112 మంది హాజరుకాగా, 4065 మంది ఉత్తీర్ణత (57.10శాతం) సాధించారు. ప్రథమ సంవత్స రం ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 21వ స్థానం నిలిచింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,899 మంది హాజరుకాగా, 4373 మంది(63.30శాతం) ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా 19వ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బా లికలే పైచేయి సాధించారు. పరీక్షలకు మొత్తం 6,822 మంది బాలురు హాజరు కాగా, 3,419 మంది (50 శాతం), 7,189మంది బాలికలు హాజరు కాగా, 5,019 మంది (69.81శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో ప్రతిభ చాటిన జిల్లా విద్యార్థులను కలెక్టర్‌ పమేలా సత్పథి, ఇంటర్‌ నోడల్‌ అధికారి సి.రమణి అభినందించారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు నిరాశకు గురికాకుండా అడ్వాన్డ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా ఇప్పటి నుంచే శ్రమించాలని సూచించారు.


ఉమ్మడి జిల్లాలో ఇలా..

నల్లగొండ జిల్లాలో సైతం బాలికలే సత్తా చూపారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో మొత్తం 16,240 మంది పరీక్షలు రాయ గా,9,805 (61ు)మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 16,061 మంది పరీక్షలు రాయ గా, 10,964మంది (68ు) ఉత్తీర్ణత సాధించారు. సూ ర్యాపేట జిల్లాలో బాలికలే హవా చాటారు. రాష్ట్రస్థాయి లో పేట 34వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 8,690 మంది పరీక్షలు రాయగా, 4,335 మంది (49.88ు) మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సం వత్సరంలో 8,639 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా, 4,798 మంది (55.5ు) ఉత్తీర్ణత సాధించారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ప్రగతి, గీతాంజలి, గౌతమి కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. ప్రగతి కళాశాలకు చెందిన జి.హర్షిత ఎంపీసీలో 990, ఎం.అశ్విత్‌రెడ్డి,989 మార్కులు సాధించారు.బైపీసీ విభాగంలో ఎస్‌.కీర్తన 987,ఆర్‌.సుహా 985మార్కులు సాధించారు. గీ తాంజలి కళాశాలకు చెందిన సీహెచ్‌.ప్రదీ్‌ప ఎంపీసీ లో 988,ఎ.గణేష్‌ 987,బైపీసీ విభాగంలో కె.నమిత 98 6,వి.కావ్య 985,టి.శ్రియ 985 మార్కులు సాధించారు. గౌతమి విద్యాసంస్థకు చెందిన బి.శ్రీహిత ఎంపీసీ వి భాగంలో 989,బి.అభినయ్‌ 988,బైపీసీ విభాగంలో జి. భార్గవి 980మార్కులు,జి.లావణ్య 979 మార్కులు సాధించారు.


ఇంటర్‌ ఫలితాలపై థర్డ్‌వేవ్‌ ప్రభావం

కరోనా ప్రభావం ఇంటర్‌ విద్యార్థులపై కన్పించింది. కరోనాతో 2020, 21లో విద్యార్థులు పరీక్షలు దూరం కా గా, ప్రతీ విద్యార్థిని ప్రభుత్వం పాస్‌ చేసింది. 2021-22 విద్యాసంవత్సరంలో సైతం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ప్రభావం చూపింది. 2021 అక్టోబరులో కరోనా సెకండ్‌వేవ్‌, 2022లో జనవరిలో ఽథర్డ్‌వేవ్‌ ఉంటుందనే ప్రచారంతో విద్యార్థుల చదువు లు పూర్తిస్థాయిలో కొనసాగక ఉతీర్ణతా శాతం పడింద ని విద్యానిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంవత్సరాన్ని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకున్నా, సకాలంలో సిలబస్‌, ప్రాక్టికల్స్‌ పూర్తికాలేదు. కొందరు విద్యార్థులు అన్‌లైన్‌ తరగతులకు పరిమితం కావటం, హాజరు శాతం తప్పనిసరి చేయకపోవడం, పరీక్షలు వాయిదా పడతాయనే ధీమాతోపాటు, గతం మాదిరిగా అందరినీ పాస్‌ చేస్తారనే భ్రమతో చాలామంది విద్యార్థులు కళాశాలలకు సక్రమంగా హాజరుకాలేదు. ఫలితంగా ఇంటర్‌లో విద్యార్థుల ఉతీర్ణ తా శాతం పడిపోయింది. ఈ ఏడాది అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్షలు ఉండగా, ఎంతమంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.


ప్రథమ సంవత్సరం ఫలితాలు ఇలా..

విభాగం బాలురు ఉత్తీర్ణత బాలికలు ఉత్తీర్ణత మొత్తం ఉత్తీర్ణత

జనరల్‌ 2,583 1,365 (52ు) 2,946 1973 (66ు) 5529 3338 (60.3ు)

ఒకేషనల్‌ 858 258 (30ు) 725 469 (64ు) 1583 727 (45.9ు)

మొత్తం 3,441 1623 (47.1ు) 3,671 2442 (66.5ు) 7112 4065 (57.1ు)

ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇలా..

విభాగం బాలురు ఉత్తీర్ణత బాలికలు ఉత్తీర్ణత మొత్తం ఉత్తీర్ణత

జనరల్‌ 2,537 1,453 57ు) 2,889 2125 (73ు) 5,426 3,578 (65.9ు)

ఒకేషనల్‌ 844 343 (40ు) 629 452 (71ు) 1,473 795 (53.9ు)

మొత్తం 3,381 1,796 (53ు) 3,518 2577 (73.2ు)   6,899 4,373 (63.3ు)

Updated Date - 2022-06-29T06:16:26+05:30 IST