విద్యా సాధికారతే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-27T05:26:30+05:30 IST

విద్యాభ్యాసానికి వయస్సు, వైవివాహిక స్థితి ఆటంకం కాదని విద్యాసాధికారిత కోసమే ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు వ్యవస్థ ఆవిర్భవించిందని ఏఎల్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సుబ్బారావు తెలిపారు.

విద్యా సాధికారతే లక్ష్యం
మాట్లాడుతున్న ఏఎల్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సుబ్బారావు

కంభం, అక్టోబరు 26 : విద్యాభ్యాసానికి వయస్సు, వైవివాహిక స్థితి ఆటంకం కాదని విద్యాసాధికారిత కోసమే  ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు వ్యవస్థ ఆవిర్భవించిందని ఏఎల్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సుబ్బారావు తెలిపారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో మంగళవారం సీఆర్పీలతో ఏర్పాటు చేసిన అత్యవసర సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. వివిధ కారణాలరీత్యా విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపివేసి చదువుకు దూరమైన వారిని గుర్తించాలని సూచించారు.  ఓపెన్‌ స్కూలు ద్వారా వారి విద్యాలక్ష్యాలను పరిపుష్టి చేసేలా  సీఆర్పీలు కృషి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు ఉన్నత విద్యకు, ఉపాధికి సంపూర్ణ అర్హత కలిగి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఏఎల్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ సత్య సాగర్‌,  సీఆర్పీలు శైలజ, అనురాధ, రామలింగయ్య, మురలీమోహన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:26:30+05:30 IST