టీడీపీ విజయమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-24T05:54:06+05:30 IST

కలిసికట్టుగా పని చేయడమే టీడీపీ కార్యకర్తల, నాయకుల లక్ష్యమ ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎనఎండీ. ఫరూక్‌ పిలుపునిచ్చారు.

టీడీపీ విజయమే లక్ష్యం
మాట్లాడుతున్న ఫరూక్‌

 పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎనఎండీ ఫరూక్‌

ఆత్మకూరు, మే 23: కలిసికట్టుగా పని చేయడమే టీడీపీ కార్యకర్తల, నాయకుల లక్ష్యమ ఆ పార్టీ  పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎనఎండీ. ఫరూక్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మకూరులోని శ్రీవెంకటేశ్వర కళ్యాణ మంటపంలో శ్రీశైలం నియోజకవర్గ మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా దివంగత ఎన్టీఆర్‌, బుడ్డా వెంగళరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు రానున్నాయని, కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని   పిలుపునిచ్చారు. 25 వేల ఓట్లకు ఓ క్లస్టర్‌గా, 5వేల ఓట్లకు ఒక యూని ట్‌గా ఏర్పాటు చేసి అందులో ప్రతి 100 ఓట్లకు ఒక సభ్యుడి ద్వారా   పర్యవేక్షించనున్నట్లు వివరించారు. శ్రీశైల నియోజకవర్గంలో బుడ్డా కుటుంబానికి చెరగని స్థానం ఉందని... అభివృద్ధి పనులన్నీ వారి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్ర మాన్ని టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.  కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లా లో టీడీపీకి అపూర్వమైన ఆదరణ కనిపిస్తోందని అన్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిందని  చెప్పారు. దీంతో వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లలేకపోతు న్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ 14స్థానాలను గెలుచు కోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. తన ప్రాణ ఉన్నంత వరకు టీడీపీలోనే కొన సాగుతూ... కార్యకర్తలకు అండగా ఉంటానని భరో సా ఇచ్చారు. తమ కుటుంబ   హయాంలో నియోజక వర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ చైర్మన మోమిన అహ్మద్‌హుసేన, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన శివరామిరెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సీ.కలిముల్లా, మహానంది దేవస్థానం మాజీ చైర్మన పాణ్యం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2022-05-24T05:54:06+05:30 IST