మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే బొల్లం

ABN , First Publish Date - 2020-09-22T07:17:23+05:30 IST

కోదాడ పట్టణంలో మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే బొల్లం

కోదాడ/ మోతె/నడిగూడెం/ సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలో మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. సీసీరోడ్డు, డ్రైన్‌, కల్వర్టుకు సోమవారం శం కుస్థాపన చేశారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, మునిసిపల్‌ కమిషనర్‌ మల్లారెడ్డి, వైస్‌చైర్మన్‌ వెంపటి పద్మమధుసూదన్‌, ఎంపీపీ చింతా కవితారెడ్డి పాల్గొన్నారు. మోతె తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపి ణీ చేశారు.


కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.యాదగిరి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ పుల్లారావు, వైస్‌ ఎంపీపీ మైనంపాటి సునీతమల్లారెడ్డి పాల్గొన్నారు. నడిగూడెం మండలం చెన్నకేశవ పురంలో ఎమ్మెల్యే చెరువులో చేప పిల్లలు వదిలారు. కార్యక్రమంలో జిల్లా మత్య్సశాఖ అధికారి సౌజన్య, ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీ టీసీ బానాల కవితనాగరాజు, వైస్‌ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, తహసీ ల్దార్‌ జవహర్‌లాల్‌, సర్పంచులు దేవబత్తిని వెంకట నర్సయ్య, గడ్డం నా గలక్ష్మీమల్లేష్‌యాదవ్‌, పుల్లమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ జి.రాజేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-09-22T07:17:23+05:30 IST