శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-22T05:07:45+05:30 IST

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు పనిచేస్తుందని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు కవాతు నిర్వహించింది.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
మెదక్‌ పట్టణంలో ర్యాపిడ్‌ యాక్షన్‌, పోలీసుబలగాల కవాతు

  మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

 జిల్లా కేంద్రంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ బలగాల ఫ్లాగ్‌మార్చ్‌


మెదక్‌ అర్బన్‌, మే 21: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు పనిచేస్తుందని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సు కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు ఇక్కడకు బలగాలు రావాలంటే ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కవాతు నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం పట్టణ సీఐ మధు, ఆర్‌ఏఎఫ్‌ కమాండర్‌ అవినాష్‌, సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, పట్ణణ ఎస్‌ఐలు రాజశేఖర్‌, మల్లారెడ్డి, స్థానిక పోలీసు అధికారుల అధ్వర్యంలో పట్టణంలోని హెడ్‌పోస్టాఫీస్‌, ఫతేనగర్‌, చమన్‌, పిట్లంబేస్‌, మార్కెట్‌, జేఎన్‌రోడ్డు, ఆటోనగర్‌, పాత బస్టాండ్‌, రాందాస్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.


ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోతనిఖీ 


విధి నిర్వహణలో పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. శనివారం ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను తనిఖీ చేసి రికార్టులను పరిశీలించారు. సమాజం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుందని, సిబ్బంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్నారు. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజల సేవలో ముందుండాలని సూచించారు. ఆమెవెంట బాలస్వామి, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్‌ఐ సూరప నాయుడు, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.


 

Updated Date - 2022-05-22T05:07:45+05:30 IST