ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-28T04:31:04+05:30 IST

మున్సిపాలిటీలను ఆదర్శ పట్ట ణాలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. సీసీసీ సింగరేణి అతి థి గృహంలో శుక్రవారం మున్సిపల్‌ చట్టం, పట్టణ ప్రగతిపై చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లకు అవగాహన కల్పించారు. 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. అవగా హన కార్యక్రమానికి కౌన్సిలర్లు తక్కువ మంది హాజ రు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
సమావేశంలో పాల్గొన్న చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు

నస్పూర్‌, మే 27: మున్సిపాలిటీలను ఆదర్శ పట్ట ణాలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని  కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. సీసీసీ సింగరేణి అతి థి గృహంలో శుక్రవారం మున్సిపల్‌ చట్టం, పట్టణ ప్రగతిపై చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లకు అవగాహన కల్పించారు. 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. అవగా హన కార్యక్రమానికి కౌన్సిలర్లు తక్కువ మంది హాజ రు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమా వేశానికి గైర్హాజరు అయిన కౌన్సిలర్లకు షోకాజ్‌ నోటీ సులు జారీ చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం 42 సూచికలను అమలు చేసినప్పుడే ఆదర్శ మున్సిపాలిటీగా పరిగణిస్తామన్నారు. ఏడు మున్సిపాలిటిల్లో పట్టణ జనాభా దాదాపు 45 శాతం ఉందని, పట్టణాల అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్ర తినిధులు కీలకంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో  548 పల్లె ప్రకృతి వనాలతోపాటు 80 బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయని, గ్రామీణ క్రీడా మైదానా లు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులో నర్సరీలు ఉండలన్నారు. 300 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటాల్సి ఉండగా 24 కిలోమీటర్ల వరకే పూర్తి చేశారన్నారు. వార్డులో మొక్కల సంరక్షణ  కౌన్సిలర్లదేనని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అభి వృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో  మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:31:04+05:30 IST