నీలగిరిని నందనవనంగా తీర్చిదిద్దమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-01T06:32:44+05:30 IST

నీలగిరిని నందనవనంగా తీర్చిదిద్దమే తమ లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు.

నీలగిరిని నందనవనంగా తీర్చిదిద్దమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన

మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి

రామగిరి, జూన 30: నీలగిరిని నందనవనంగా తీర్చిదిద్దమే తమ లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి అన్నారు. గురువారం మునిసిపాలిటీలో నిర్వహించిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఇప్పటికే రోడ్ల విస్తరణ పనులు, జంక్షన అభివృద్ధి పనులు, రాజీవ్‌, చర్లపల్లి పార్కు వంటి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులను జూలై 3వ వారంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో పట్టణంలో అంతర్గత రోడ్ల ఏర్పాటుకు ఇతర అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ద్వారా వార్డుకు రూ.1కోటి చొప్పున రూ.48 కోట్లు కేటాయించాలని తెలిపారు.  అదేవిధంగా కళాభారతికి రూ.70 కోట్లు, ట్యాంక్‌బండ్‌కు రూ. 130 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు పట్టణంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి వాటన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు డీఎంఏ అధికారి అనుమతితో ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 120 మైక్రాన్స కన్నా ఎక్కువ ఉండే పాలిథీన కవర్లను నిషేధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎజెండాను ఆమోదించారు. సమావేశంలో ఏఎమ్‌సి సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, ఈఈ శ్రీనివాస్‌, ఏసీపీ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన అబ్బగోని రమేష్‌, ఆర్‌ఐ ఖాజా ఆరిఫోద్దీన, డీఈలు, ఏఈలు సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T06:32:44+05:30 IST