ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-28T13:54:50+05:30 IST

విద్యా, వైద్యానికి పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సబితారెడ్డి అన్నారు. అందులో భాగంగానే..

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యం

మంత్రి సబితారెడ్డి


మంగళ్‌హాట్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): విద్యా, వైద్యానికి పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల(Public schools)ను కార్పొరేట్‌ పాఠశాలలు(Corporate schools)గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సబితారెడ్డి అన్నారు. అందులో భాగంగానే ముందుగా ఆలీయా, మహబూబియా స్కూల్‌లో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. శుక్రవారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీలతో కలిసి ఆబిడ్స్‌లోని ఆలియా, మహబూబియా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 


ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత నీటి యజ్ఞం ఎలా ప్రారంభించామో అదే విధంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధ్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ రూ. 7,300 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కేవలం రంగులు వేసి వదిలేయకుండా అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కమిటీని నియమించడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌,   కలెక్టర్‌ శర్మన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు నందకిషోర్‌ వ్యాస్‌తో పాటు పలు విభాగాల అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T13:54:50+05:30 IST