శాంతియుత సమాజమే పోలీస్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-22T06:05:13+05:30 IST

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ వేడు కలు నిర్వహించారు

శాంతియుత సమాజమే పోలీస్‌ లక్ష్యం

కలెక్టర్‌ రవి

ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ వేడుకలు


జగిత్యాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ వేడు కలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ సురేష్‌తో పాటు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఎస్పీ సింధు శర్మ మా ట్లాడుతూ సమాజం కోరుకునే శాంతిని, స్థిరత్వాన్ని, అభివృద్ధిని పోలీస్‌ శాఖ కోరుకుంటుందన్నారు. ఆరు మాసాలుగా కోవిడ్‌ మహమ్మారిని అరికట్టడంలో పోలీస్‌ శాఖ చేపట్టిన కృషిని మరువలేనివని అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఈ నెల 21 నుంచి 31 వరకు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమ రవీరుల కుటుంబసభ్యులకు కలెక్టర్‌ రవి చేతులమీదుగా బస్‌ పాస్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్‌, డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌ బాబా, ప్రతా ప్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. 


ధర్మపురి : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల ఆశయాలను కొనసాగించాలని ధర్మపురి సీఐ రాంచందర్‌రావు పేర్కొన్నారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని పోలీస్‌ అమర వీరుల స్థూపం వద్ద మంగళవారం ఆయన ఎస్సై శ్రీకాం త్‌, పోలీస్‌ సిబ్బందితో కలిసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T06:05:13+05:30 IST