దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-29T06:12:35+05:30 IST

రాష్ట్రంలోని దళితులు అన్నిరంగా ల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నా రు.

దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

 కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి 

మునుగోడు రూరల్‌, సెప్టెంబరు 28: రాష్ట్రంలోని దళితులు అన్నిరంగా ల్లో అభివృద్ధి  చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని జమస్థాన్‌పల్లిలో 39మంది దళితులకు మంజూరైన దళితబంధు పథకం యూనిట్లను పరిశీలించారు. పథకం కింద ఏ యూని ట్‌ తీసుకున్నారు. అందులో ఎంతవరకు ఉపాధి లభిస్తుంది, ఇంకా మార్కెటిం గ్‌ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల సూచనలు తీసుకోవాలని సూచించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు సలహాలు, సూచన లు ఇస్తూ వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సహకరించాలన్నారు. ఈపథకం నిధులను దుర్వినియోగపర్చకుండా భవిష్యత్‌లో ఆర్థికంగా నిలబడేందుకు వినియోగించుకోవాలన్నారు. నల్లగొండ జిల్లాలో 517మందికి దళితబంధు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యా దవ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఏడీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ పం తంగి పద్మాస్వామిగౌడ్‌, కార్యదర్శి సరిత, ఆర్‌ఐ దుర్గా మహేశ్వరి, ఉపసర్పంచ్‌ రాధ, కోఆప్షన్‌ సభ్యులు, దళితబంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T06:12:35+05:30 IST