
హైదరాబాద్: బీజేపీ తలపెట్టిన ర్యాలీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జేపీ నడ్డా ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించేందుకు అనుమతిని పోలీసులు ఇచ్చారు. సికింద్రాబాద్‌లో కార్యకర్తలను వెనక్కి పంపాలని పోలీసులు సూచించారు. కరోనా ఆంక్షలు పాటించాలని పోలీసులు సూచించారు. గాంధీకి నివాళుల తర్వాత బీజేపీ కార్యాలయానికి జేపీ నడ్డా వెళ్లనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్ అరెస్ట్‌పై జేపీ నడ్డా ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి