కోర్టు చెప్పినా వినని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-03T05:05:04+05:30 IST

ఉపాధి బిల్లులు చెల్లించాలని కోర్టు చెప్పినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ అరకు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఉపాధి పనుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

కోర్టు చెప్పినా వినని ప్రభుత్వం
సాలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు సంధ్యారాణి, భంజ్‌దేవ్‌ తదితరులు

టీడీపీ అరకు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి

సాలూరు రూరల్‌, ఆగస్టు 2: ఉపాధి బిల్లులు చెల్లించాలని కోర్టు చెప్పినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ అరకు పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఉపాధి పనుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో గొల్లపల్లి పార్వతికి వినతిపత్రమందించారు. అంతకుముందు సంధ్యారాణి మాట్లాడుతూ సీఎంకు ప్రజలు, అధికారులు, చివరకు కోర్టు చెప్పినా చెవికెక్కడం లేదని విమర్శించారు. కేంద్రం ఉపాధి బిల్లులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల పంచాయతీ సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆరోపించారు. పంచాయతీ నిధులను సైతం వారికి తెలియకుండానే తీసివేయడం దారుణమన్నారు. పంచాయతీల్లో వివిధ పనులకు సర్పంచ్‌లు చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేత భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు డబ్బి కృష్ణారావు, ఆముదాల పరమేశు, ఆముజూరు శ్రీనివాసరావు, రజని, చిట్టి, డొంక ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-03T05:05:04+05:30 IST