హామీల అమలులో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-08-18T06:22:04+05:30 IST

హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న తాతయ్యబాబు

చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తాతయ్యబాబు

బుచ్చెయ్యపేట, ఆగస్టు 17: హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. బుచ్చెయ్యపేట మండల క్లష్టర్‌ బూత్‌ కన్వీనర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్‌ ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే విద్యుత్‌, బస్సు, ఇతర చార్జీలు పెంచమని జగన్‌ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. సంక్షేమాల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ర్టాన్ని సీఎం జగన్‌ అన్నింటా దివాళా తీయించారని ఆ రోపించారు. తిరోగమనంలో ఉన్న ఏపీ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే సత్తా ఒక్క చంద్రబాబునాయుడుకే ఉందని తాతయ్యబాబు పేర్కొన్నారు. టీడీపీపై ప్రజలు అభిమానంగా ఉన్నారని, దీన్ని ఓటుగా మలచుకోవాలని సూచించారు. సమా వేశంలో తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, నాయకులు అప్పలనాయుడు, కె.రవికుమార్‌, ఎస్‌.సూరిబాబు, వి.అప్పారావు, వి.శ్రీను, కె.సత్యనారాయణ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:22:04+05:30 IST