కొవిడ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-06-17T06:21:43+05:30 IST

కొవిడ్‌ బాధితులను ఆదుకో వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీమంత్రి పల్లె రఘనాఽథరెడ్డి విమర్శించారు

కొవిడ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ధర్మవరంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు

పుట్టపర్తిరూరల్‌, జూన 16: కొవిడ్‌ బాధితులను ఆదుకో వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీమంత్రి పల్లె రఘనాఽథరెడ్డి విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పిలు పు మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ప్రభు త్వ పనితీరుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం సరఫరా చేసిన వ్యాక్సిన కూడా సరిగా వినియోగిం చుకోలేక పోవడం ప్రభుత్వ చేతగాని తనమన్నారు. కరోనా రోగులకు ఆసుపత్రులలో సరి యైున వైద్యసదుపాయాలు కల్పించలేక పోవడం శోచనీ యమన్నారు. బాధిత కుటుంబాలకు వెంటనే 10 లక్షల పరిహారం అందించా లన్నారు. తెల్ల కార్డుకలిగిన ప్రతి కుటుంబా నికి 10 వేల ఆర్థికసాయం అందించాలని, ఫ్రంట్‌లైనవారియర్స్‌ మరణిస్తే 50లక్షల బీమా సౌకర్యం, ఆక్సిజన అందక మరణిం చినవారికి 25 లక్షలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనం తరం డిప్యూటీ తహసీల్దార్‌ నరసింహులుకు వినతిప త్రం అందచేశారు. కార్యక్రమంలో ఆపార్టీ కన్వీనర్లు విజయ్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన బెస్తచలపతి, నాయకులు ఆదినారాయణరెడ్డి, రాసువారి రాధాకృష్ణ గూడూ రు ఓబిళేసు, కొత్తపల్లి జయ ప్రకాశ, గంగాధర్‌ నాయుడు, అంబులెన్స రమే ష్‌, రాజప్ప సత్తి సుదాకర్‌ మనోహర వెంకటేష్‌, పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

ఫ్రంట్‌లైన వారియర్స్‌ మరణిస్తే రూ. 50 లక్షలు ఇవ్వాలి: పల్లె

పుట్టపర్తి: కరోనా వైరస్‌తో ప్రంట్‌లైన వారియర్స్‌ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం చెల్లించాలని మాజీ మంత్రిపల్లెరఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థాని క టీడీపీ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడు తూ...కరోనా వైరస్‌ కట్టడిలో ఫ్రంట్‌లైన వారియర్స్‌గా పని చేస్తున్న డాక్టర్‌లు, వైద్యసిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ కార్మికులు, జర్నలిస్టులు  కరోనాతో మరణిస్తే వారి కుటుంబాల కు ప్రభుత్వం రూ.50లక్షల పరిహా రాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మూడో వేవ్‌ ఉంటుందని హెచ్చరిస్తున్న తరుణంలో ముందస్తుగా ఆక్సిజన బెడ్లు, ఐసీ యూ, వైద్యసి బ్బందిని ఏర్పాటు చేసుకోవాల న్నారు. సమావేశంలో నాయకు లు వెంగలమ్మచెరువు ఆది నారాయణరెడ్డి, గూడురు ఓబులేశు. విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు, బేకరినాయుడు, టైల ర్‌ నిజాం, ఆంబులెన్స రమేశ, కొత్తపల్లి జయప్రకాశ, మనోహర్‌, ఆంజనేయులు  పాల్గొన్నారు.

కొత్తచెరువు: కరోనాతో మరణించిన కుటుంబాలకు ప్రభు త్వం పరిహారం అందించాలని లేదంటే వీటిపై టీడీపీ పోరా టం చేస్తోందని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ...కరోనా కారణంగా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందు లలో కూరుకుపోయారని, అయితే ప్రభుత్వం నేటికి వారికి సరైన ఆశ్రయం కల్పించలేదన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితు లలో ప్రభుత్వం అన్ని విదాల ఆదుకోవాలన్నారు. 

ధర్మవరంఅర్బన: కరోనావైరస్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన కమతంకాటమయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరికీ వ్యాక్సిన ఇచ్చి ప్రాణాలను కాపా డాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసదుపాయాలను మెరు గుపరచాలని డిమాండ్‌ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు ఇవ్వాలన్నారు. ఆక్సిజన అందక మరణించిన ప్రతి కుటుంబానికి రూ.25లక్షలు ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. మేనెలలో కరోనా మృతుల అంత్య క్రియలకు రూ.15వేలు చెల్లిస్తామని  ఇంత వరకు ఏ ఒక్కరికి ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.  జర్నలి స్టులను ఫ్రంట్‌లైన వారియర్స్‌గా గుర్తించాలన్నారు.  అనంత రం తహసీల్దార్‌ కార్యాల యంలో డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మీనా రాయణరెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేకల రా మాంజినేయులు, టీడీపీ నాయ కులు పోతుకుంట లక్ష్మన్న, పరిసేసుధాకర్‌, రుద్రారవి, పురుషో త్తంగౌడ్‌, రాంపురం శీన, బిల్లేశీన, పల్లపురవి, మాబు, గోపాల్‌, టీఎనఎస్‌ ఎఫ్‌ జిల్లా అధికార ప్రతినిధి చిన్నూర్‌ విజయ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T06:21:43+05:30 IST