పేదల అభివృద్ధిని ప్రభుత్వం మరిచిపోయింది

ABN , First Publish Date - 2022-08-13T05:27:44+05:30 IST

పేద, నిరుపేదల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని వీరికోసం వచ్చే 2024 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం బ్రహ్మంగారిమఠంలోని రెడ్ల

పేదల అభివృద్ధిని ప్రభుత్వం మరిచిపోయింది
పాత్రికేయులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి

2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి 

బ్రహ్మంగారిమఠం, ఆగస్టు 12 : పేద, నిరుపేదల అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని వీరికోసం వచ్చే 2024 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం బ్రహ్మంగారిమఠంలోని రెడ్ల అన్నదాన సత్రంలో దుగ్గిశెట్టి వారి వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో దళితుల అభివృద్ధిని పూర్తి స్థాయిలో మరిచిపోయారని అన్నారు. అలాగే బీసీ, మైనార్టీ, పేద, నిరుపేదలను పట్టించుకోవడం లేదని తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఇదివరకే ఓ పార్టీ తనకు హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-08-13T05:27:44+05:30 IST