గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
షాద్‌నగర్‌ రూరల్‌: ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 27: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌లో సోమవారం సీడీపీ నిధులు రూ.15లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, పీడీఎఫ్‌ నిధులు రూ.9లక్షలతో సీసీరోడ్డు, డీఎంఎఫ్‌ నిధులు రూ.15లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవననిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, ఎంపీపీ ఖాజాఇద్రిష్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ శ్రీశైలం, నాయకులు లక్ష్మణ్‌నాయక్‌, మన్నె నారాయణయాదవ్‌, కట్టా వెంకటే్‌షగౌడ్‌, బాబూనాయక్‌, రఘుమారెడ్డి, మల్లేష్‌, బుచ్చిలింగంగౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ మండలం కొండన్నగూడ గ్రామానికి చెందిన బాలరాజ్‌కు దళిత బంధు కింద మంజూరైన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడుతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, నాయకులు పాపయ్య, విశ్వం, రమేష్‌, లక్ష్మణ్‌నాయక్‌ పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ 

షాద్‌నగర్‌: సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2.18లక్షల చెక్కులను సోమవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీవై్‌సచైర్మన్‌ ఈట గణేష్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అగ్గునూరి విశ్వం, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

సీసీరోడ్డు పనులు ప్రారంభం 

నందిగామ: నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్‌ జిల్లెల్ల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.30లక్షల గ్రామపంచాయతీ ప్రత్యేకనిధులతో గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీరోడ్ల పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమవారం ప్రారంభించారు. పిట్టలగూడకు చెందిన గంగిశెట్టి కుమార్‌, లావణ్యలకు రూ.41వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీవై్‌సచైర్మన్‌ ఈట గణేష్‌, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ వి.నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, ఎంపీటీసీ చంద్రపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మెక్కొండ కుమార్‌గౌడ్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST