ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం శీతకన్ను

ABN , First Publish Date - 2021-07-24T05:59:44+05:30 IST

ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమంపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోందని, తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆగదని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. పాత కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం శీతకన్ను
కడపలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న ఫ్యాప్టో నాయకులు

డిమాండ్లు సాఽధించే వరకు పోరాటం

ఫ్యాప్టో నాయకులు

కడప(ఎడ్యుకేషన), జూలై 23: ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమంపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోందని, తమ డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆగదని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. పాత కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఇనచార్జి మల్లు రఘునాఽథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ఉపాధ్యాయ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉన్నాయన్నారు. 2018 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటానన్న ప్రభుత్వం నేటికీ పట్టించుకోలేదని విమర్శించారు. ఆరు విడతల డీఏ పెండింగులో ఉన్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు దశల వారీగా పోరాటాల్లో భాగంగా తాలుకా కేంద్రాల్లో ధర్నా చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లాపరిశీలకులు జీవీ నారాయణరెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా ఫ్యాప్టో చైర్మన ఖాదర్‌బాషా, సెక్రటరీ జనరల్‌ ప్రసాద్‌, రూటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్బాల్‌, ఆయుబ్‌, ఐటా రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ రజాక్‌, ఎస్‌ఏపీఈ జిల్లా నాయకులు ప్రవీణ్‌, నిత్య ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T05:59:44+05:30 IST