ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-25T05:59:33+05:30 IST

ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం
రైతులతో మాట్లాడుతున్న మహేశ్వర్‌ రెడ్డి

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి

సోన్‌, జూలై 24 : ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సోన్‌, గంజాల్‌ గ్రామాల్లో వరదముంపుకు గురైన పంటపొలాలను, కోతకుగురైనరోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో ప్రాణాలు పోతుంటే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రోడ్లపై చేపలు పడుతూ జల్సాలు చేయడం సిగ్గుచేటన్నారు. కేవలం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రనష్టం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వర్ణగేట్లు ఎత్తివేయడంతోనే నష్టం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సరికెల గంగన్న, మండల పార్టీ అధ్యక్షుడు మార గంగారెడ్డి, నాయకులు బర్ల హరీష్‌రెడ్డి, ఫక్రు ద్దీన్‌, సందుగారి నవీన్‌, సాయన్న, గంగయ్య, ముత్తన్న, లింగయ్య, హైమద్‌, తదితరులు ఉన్నారు. 

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

సారంగాపూర్‌, జూలై 24 : భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని ఐసీసీ కార్యాచరణ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని గోపా ల్‌పేట్‌, సాయినగర్‌ తండా, బోరిగాం, ధని గ్రామాల్లో పర్యటించి వరద నీటికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి పంటలు నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడారు. రైతులు నష్టపోయిన పంట పొలా లను సంబంధిత అధికారులతో సర్వే చేయించి నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో వర్షానికి కూలిన ఇళ్ల బాధితులకు వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామ్‌ శంకర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నక్క రాజన్న, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దశరథ్‌ రాజేశ్వర్‌, నాయకులు మధుకర్‌, వీరయ్య, నరేష్‌, దయాకర్‌రెడ్డి, సాహేబ్‌రావు, ముత్యంరెడ్డి, జమాల్‌లతో పాటు నాయ కులు, రైతులు పాల్గొన్నారు. 

మహేశ్వర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 24 : శనివారం నిర్మల్‌ పట్టణంలోని సోఫీనగర్‌లో మహేశ్వర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నాందేడపు చిన్ను, జునైద్‌, ఇమ్రానుల్లా, చరణ్‌మౌర్య, సంతోష్‌, సాయికుమార్‌, ప్రజ్యోత్‌, తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. మహేశ్వర ట్రస్ట్‌ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చిన్ను తెలిపారు. 

Updated Date - 2021-07-25T05:59:33+05:30 IST