ప్రభుత్వమే ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-11-27T05:16:20+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేటు టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైవేటు టీచర్ల యూనియన్‌ రాజాం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు జె.మోహనరావు, కె.అప్పారావు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు


రాజాం రూరల్‌: కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేటు టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైవేటు టీచర్ల యూనియన్‌ రాజాం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు జె.మోహనరావు, కె.అప్పారావు డిమాండ్‌ చేశారు. రాజాంలో గురువారం వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డోలపేట కూడలి నుంచి నాలుగురోడ్ల కూడలి వరకూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.  ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు చెప్పారు.  ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, గణేష్‌, మన్మథరావు, ఢిల్లీశ్వర్రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-27T05:16:20+05:30 IST