ముంబైలో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయించిన మహారాష్ట్ర సర్కార్

ABN , First Publish Date - 2022-04-30T17:39:26+05:30 IST

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఏకరాల స్థలాన్ని టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ముంబైలో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయించిన మహారాష్ట్ర సర్కార్

తిరుమల: ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం  కేటాయించింది. 500 కోట్ల రూపాయలు విలువ చేసే 10 ఎకరాల స్థలం పత్రాలను టీటీడీ చైర్మన్‌కు మహారాష్ట్ర సీఎం తనయుడు మంత్రి ఆదిత్య ధాక్రె శనివారం అందజేశారు. ఆలయ నిర్మాణానికి రూ.60 కోట్లను వెచ్చించడానికి గౌతమ్ సింఘానియా అనే దాత ముందుకు వచ్చారు. మహరాష్ట్రలోని వేదిక్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటు చేయ్యాలని ఈ సందర్భంగా ఆదిత్య ధాక్రె కోరాగా... అందుకు టీటీడీ సానుకూలంగా స్పందించింది. టీటీడీకి స్థలం విరాళంగా ఇచ్చినందుకు ఆదిత్య థాక్రేను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సన్మానించారు. 

Updated Date - 2022-04-30T17:39:26+05:30 IST