Advertisement

పోచారంపై పట్టింపేదీ?

Sep 22 2020 @ 01:16AM

ప్రాజెక్టు ఎత్తు పెంపును పక్కన పెట్టిన ప్రభుత్వం

ప్రతియేటా 3 టీఎంసీలకు పైగా నీరు వృథా

నీటిమూటగానే మారిన సీఎం కేసీఆర్‌ హామీ

అఖిలపక్షం పాదయాత్రకు దక్కని ఫలితం

ఇకనైనా ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచాలంటున్న ఆయకట్టు రైతులు


కామారెడ్డి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని నాగిరెడ్డిపే ట, ఎల్లారెడ్డి మండలాలకు సాగునీరు అందించే పోచారం ప్రాజెక్టుపై ప్రభుత్వ పట్టింపు కరువైంది. ఆరేళ్లక్రితం ఎన్నిక ల ప్రచారంలో సీఎం కేసీఆర్‌.. పోచారం ప్రాజెక్టు ఎత్తు పెం చుతామని ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటి కీ.. పోచారం ప్రాజెక్టు కలను మాత్రం నెరవేర్చడం లేదు. పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్న ఆయకట్టు రైతుల డిమాండ్‌ నెరవేరడం లేదు. ఐదుఫీట్ల ఎత్తుపెంచితే అదన ంగా పదివేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్న అధికా రుల ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. దీంతో ప్రతీ సంవత్సరం మూడు టీఎంసీలకుపైగా నీరు వృథా అవుతూనే ఉంది. దీంతో ఆయకట్టుకు అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు.


1922లో పూర్తయిన ప్రాజెక్టు

ఎల్లారెడ్డి డివిజన్‌లోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలా ల పరిధిలోని ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ని జాం కాలంలో పోచారం గ్రామ శివారులోని మంచిప్ప వాగు పై పోచారం ప్రాజెక్టును నిర్మించారు. 1917లో ప్రారంభమై న నిర్మాణం 1922లో పూర్తయింది. రూ.27.11 లక్షల వ్యయం తో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 21అడుగుల ఎత్తు, 1.7 కిలో మీటర్ల పొడవుతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు దిగువన ఉన్న భూములకు సాగునీటిని అందించేలా అప్పట్లోనే 58 కిలో మీటర్ల పొడవున కాలువలను తవ్వించారు. దీనికి 73 డిస్ట్రిబ్యూటరీలను సైతం విభజించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10,500 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టును రెండు జోన్లుగా విభజించారు. ప్రఽ దాన కాలువ డిస్ట్రిబ్యూటరీ 1 నుంచి 48 వరకు ఏ జోన్‌గా, 49 నుంచి 73వ డిస్ట్రిబ్యూటరీ వరకు బీ జోన్‌గా విభజించా రు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో రెండు జోన్లకు సాగునీరు అంది స్తుండగా రబీలో మాత్రం ఒకసారి ఏ జోన్‌కు మరోసారి బీ జోన్‌కు నీరందిస్తున్నారు.


వృథా అవుతున్న నీరు

పోచారం ప్రాజెక్టును 3.04 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిం చాలని తలపెట్టినప్పటికీ ప్రతికూల పరిస్థితుల కారణంగా 2.423 టీఎంసీలకు పరిమితం చేశారు. తొమ్మిది దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టులో పూడిక పేరుకు పోయింది. దీంతో నీటినిల్వ సామర్థ్యం 1.52 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టులో ప్రతీ ఏడాది పూడిక పెరిగి నీటి నిల్వ సామర్థ్యం పడిపోతుండడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అం దించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వర్షాకా లంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్టు నిండి నీరు వృ థాగా పోతోంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో ప్రాజె క్టు దాదాపు రెండు నెలల పాటు పొంగిపొర్లింది. దాదాపు 3 టీఎంసీల నీరు వృథాగా పోయింది. ఈ ఏడాది కూడా నెల రోజుల క్రితం నుంచే భారీ కురవడంతో ప్రాజెక్టు నిండి సుమారు 3 టీఎంసీలకు పైగానే నీరు వృథాగా పోయింది.


ప్రతిపాదనలను పక్కన పెట్టిన ప్రభుత్వం

పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి గాను నీటిపారుదల శాఖ అధికారులు సంవత్సరం క్రితమే ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించారు. ఐదు ఫీట్ల ఎత్తు పెంచితే ప్రాజెక్ట్‌ నీటినిల్వ సామర్థ్యం 2.650 టీఎంసీలకు పెరుగుతుందని ప్ర తిపాదనలలో పేర్కొన్నారు. తద్వారా ప్రాజెక్ట్‌ ఆయకట్టు స్థిరీ కరణ జరగడంతో పాటు మరో ఏడువేల ఎకరాల ఆయకట్టు కు నీరందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంచితే 640 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంద ని అధికారులు అంచనా వేశారు. కామారెడ్డి జిల్లాలోని లిం గంపేట మండలం షెట్పల్‌సంగారెడ్డి, మాలపాటి, నాగిరెడ్డి పేట మండలంలోని వదల్‌పర్తి గ్రామాలు, మెదక్‌ జిల్లాలోని కొత్తపల్లి, రాజ్‌పేట, బూర్గుపల్లి, వాడి గ్రామాల పరిధిలో భూములు ముంపునకు గురవుతాయని ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపగా ప్రభుత్వం మాత్రం పక్కనపెట్టిందని రైతు లు వాపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్‌ పోచారం ప్రాజెక్ట్‌ను ఎందుకు పట్టిం చుకోవడం లేదని ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి.


గతంలో అఖిలపక్ష నేతల పాదయాత్ర

 పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంపు అంశంపై మూడు సంవ త్సరాల క్రితం అఖిలపక్ష నేతలు దాదాపు 50 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు వడ్డెపల్లి సుభా ష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డితో పాటు రైతు నాయకుడు నర్సింహారెడ్డి, ఆయా పార్టీల నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే తర్వాత కాలంలో ప్రా జెక్టు ఎత్తుపెంపు విషయాన్ని అటు రాజకీయ పార్టీలు, నీటి పారుదలశాఖ అధికారులు మర్చిపోయారు. దీంతో ప్రాజెక్టు ఎత్తుపెంపు అంశం అటకెక్కింది. రైతుల డిమాండ్‌ పరిష్కా రానికి నోచుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పోచారం ప్రాజె క్టు ఎత్తు పెంపు విషయంలో చొరవ చూపి నీటి వృథాను అరికట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఎత్తు పెంచితే రెండు మండలాలకు మేలు..మంగళి నర్సింలు ( రైతు, పోచారం )

పోచారం ప్రాజెక్టు ఎత్తు 5 ఫీట్లు పెంచితే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో రైతుల కు ఎంతో మేలు జరుగుతుం ది. ప్రాజెక్టులో మట్టిపూడిక పేరుకపోవడంతో సామర్థ్యం తగ్గిపోయింది. ప్రతీ సంవత్స రం ప్రాజెక్టు నిండినా నీరు వృథాగా పోతోంది. ఎత్తు పెంచితే నీరు నిల్వ ఉం టుంది. దీంతో ఆయకట్టు కింద వేల ఎకరాలకు సాగునీరు అందడంతో రైతు పుష్కలంగా పంటలు పండించుకోవచ్చు.


కాళేశ్వరంతో నింపింది లేదు.. ఎత్తు పెంచింది లేదు..సుభాష్‌రెడ్డి, పీసీసీ నేత

పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని చాలాసార్లు మం త్రులకు విన్నవించడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అఖిల పక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినా ప్రభుత్వం స్పందిం చలేదు. కనీసం స్థానిక ఎమ్మె ల్యేలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 22వ ప్యాకేజీ ద్వారా పోచారం ప్రాజెక్టును నింపుతామని స్థానిక ప్రజాప్ర తినిధులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రాజెక్టు ను నింపింది లేదు.. ఎత్తు పెంచింది లేదు. దీంతో ప్రతీ ఏటా ప్రాజెకు నీరంతా వృథా అవుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఆందోళన చేపడుతుంది.


పాదయాత్ర చేసినా.. పట్టించుకోలేదు..బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు 

పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని మూడు సంవత్స రాల క్రితం అఖిల పక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర చేప ట్టినా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రాజె క్టు ఎత్తు పెంచితే ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలోని సుమారు 15 వేల ఎకరాల వరకు సాగునీరు అంది రైతులకు మరింత మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు ఎత్తుపెంపుపై దృష్టి సారించాలి.

Follow Us on:
Advertisement
Advertisement