విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి

ABN , First Publish Date - 2022-07-03T05:54:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడనాడాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని యూఎస్‌పీ ఎస్‌సీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు రఘుశంకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు.

విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
సమావేశంలో మాట్లాడుతున్న యూఎస్‌పీఎస్‌సీ బాధ్యులు

యూఎస్‌పీఎస్‌సీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు రఘుశంకర్‌ రెడ్డి 

జగిత్యాల అర్బన్‌, జూలై 2: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యాన్ని విడనాడాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని యూఎస్‌పీ ఎస్‌సీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు రఘుశంకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ జూలై 7న చేపట్టే మహాధర్నా విజయవంతానికి ఉపాధ్యాయులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ని ర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరి ష్కా రానికి ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధ ర్నా కు జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు విచ్చేసి విజయవంతం చే యాలన్నారు. ఈ సమావేశంలో సంఘ బాధ్యులు గుంటి ఎల్లయ్య, గం గాధర్‌, లక్ష్మారెడ్డి, రాములు, శ్రీధర్‌, చంద్రమౌళి, శ్యాంసుందర్‌, భూమేశ్వర్‌, రమేష్‌, రాంచంద్రందితరులున్నారు. 

ఫదీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5న విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలని జాక్టో జిల్లా ఛైర్మెన్‌ భైరం హరికిరణ్‌, రాస్త్ర స్టీరింగ్‌ కమిటీ బాధ్యులు మార్వాడి గంగా రాజు, లక్ష్మణ్‌ గౌడ్‌, వైఎస్‌ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సన్నాహక సమావేశంలో వక్తలు మాట్లాడారు. 

పాఠశాల విద్యలో ఉపాధ్యాయ సమస్యలు ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నా యని వాటిని పరిష్కరించుకోవడంతో పాటు, బదిలీలు, పదోన్నతుల షె డ్యూల్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-03T05:54:15+05:30 IST