ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలి : జూలకంటి

ABN , First Publish Date - 2022-06-28T05:35:30+05:30 IST

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలి : జూలకంటి
ధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ రూరల్‌, జూన్‌ 27 : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సాగర్‌ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నడిపిస్తుందని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.యుద్ధప్రాతిపదికన ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అదేసమయంలో అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలన్నారు. ఎత్తిపోతల నిర్వహణ బాధ్యత ఐడీసీకి అప్పగించాలన్నారు. సాగర్‌ ఆయకట్టులో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు  అందించేందుకు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటుచేశారని, మోటర్లు పనిచేయక లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో రైతులతో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ధర్నాలో రైతులు, రైతు సంఘం నాయకులు పెద్దఎత్తున  పాల్గొన్నారు. అనంతరం  నీటి పారుదల శాఖ  సీఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం, వివిధ ఎత్తిపోతల పథకాల చైర్మన్లు పాదూరి శశిధర్‌రెడ్డి, చళ్లమళ్ల అంజిరెడ్డి, ఊట్ల పూర్ణచందర్‌రావు, ఎస్‌కె వలి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-06-28T05:35:30+05:30 IST