‘పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి’

ABN , First Publish Date - 2020-09-22T06:42:56+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థి ఎన్నిక కోసం పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని మేడ్చల్‌ నియోజకవర్గ

‘పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి’

మేడ్చల్‌: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థి ఎన్నిక కోసం పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని మేడ్చల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆ పార్టీ మేడ్చల్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు సీహెచ్‌ శేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మేడ్చల్‌ పట్టణానికి చెందిన పట్టభద్రుల వివరాలను మహేందర్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2016కు ముందు ఏదైనా డిగ్రీ విద్యలో ఉత్తీర్ణులైన యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని తెలిపారు. పట్టభద్రుల ఎన్నిక ఫారం-18లో వివరాలను నింపి అందజేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించి పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మెరుగు మోహన్‌రెడ్డి, శైలేందర్‌, కౌన్సిలర్‌ సాయికుమార్‌, నాయకులు నడికొప్పు నాగరాజు, శంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-22T06:42:56+05:30 IST