ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి

ABN , First Publish Date - 2021-05-11T06:09:48+05:30 IST

రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని ధాన్యం కోనుగోలు కేంద్రాల వద్దకు తీసుకరావాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలి
వర్గల్‌లో ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలిస్తున్న శ్రావణ్‌కుమార్‌

జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్‌

వర్గల్‌, మే 10 : రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని  ధాన్యం కోనుగోలు కేంద్రాల వద్దకు తీసుకరావాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన వర్గల్‌తో పాటు మైలారం, మజీద్‌పల్లి, శాఖారం, తునికిఖాల్సా, వేలూర్‌, నెంటూర్‌ గ్రామాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండే విధంగా ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ధాన్యం పెట్టిన రెండు మూడు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ప్రతి రైతు కరోనా నియంత్రణ కోసం విధిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి సకలే్‌షతో పాటు పలు గ్రామాల ఏఈవోలు, రైతులు ఉన్నారు.  

Updated Date - 2021-05-11T06:09:48+05:30 IST