కేంద్రాలకు ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకురావాలి

ABN , First Publish Date - 2021-04-23T05:43:48+05:30 IST

కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకురావాలని, తరుగుతో కలిపి 41 కిలోల తూకం వేయించుకోవాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అన్నారం, అబులాపూర్‌, కొడుపాక, పాపన్నపేట, మినపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆమె ప్రారంభించారు.

కేంద్రాలకు ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకురావాలి
మాసాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మదనరెడ్డి

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదనరెడ్డి


పాపన్నపేట, ఏప్రిల్‌ 22: కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తాలు లేకుండా తీసుకురావాలని, తరుగుతో కలిపి 41 కిలోల తూకం వేయించుకోవాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అన్నారం, అబులాపూర్‌, కొడుపాక, పాపన్నపేట, మినపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతన్న పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల కష్టం దళారుల పాలవకుండా  చూసేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలోనూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చందనా ప్రశాంతరెడ్డి, కొత్తపల్లి సొసైటీ చైర్మన రమేష్‌, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధనరెడ్డి, పాపన్నపేట సొసైటీ చైర్మన మోహనరెడ్డి, సర్పంచలు జగన, లింగారెడ్డి, సంగప్ప, గురుమూర్తిగౌడ్‌, ఎంపీటీసీ కుభేరుడు, సొసైటీ డైరెక్టర్‌ కిష్టయ్య, తహసీల్దార్‌ బలరాం, ఏవో ప్రతాప్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

దళారులను నమ్మి మోసపోవద్దు

నిజాంపేట, ఏప్రిల్‌ 22: రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆమె నిజాంపేటలో కొవిడ్‌ టీకా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జడ్చెరువు తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతల సౌకర్యం కోసం జిల్లాలో 358 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, జడ్పీటీసీ విజయ్‌కుమార్‌, సొసైటీ చైర్మన బాపురెడ్డి, సర్పంచ అనూష, ఎంపీటీసీ లహరి, సర్పంచల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి, బాల్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు : ఎమ్మెల్యే మదనరెడ్డి

వెల్దుర్తి ఏప్రిల్‌ 22: మాసాయిపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదనరెడ్డి గురువారం ప్రాంభించారు. కొనుగోలు కేంద్రంలో ఏ గ్రేడు ధాన్యానికి రూ. 1,885, బి గ్రేడు ధాన్యానికి 1,868 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నదని వెల్లడించారు. రెతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారీలను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూప్రాన ఆర్డీవో శ్యామ్‌ప్రకాష్‌, తహసీల్దార్‌ మాలతి, డీసీసీబీ డైరెక్టర్‌ అనంతరెడ్డి, రెతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ వేణుగోపాల్‌రెడ్డి. సర్పంచలు మధుసూదనరెడ్డి, గోపి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ నర్సింహులు, సిద్దిరాములుగౌడ్‌, నాగరాజు పాల్గొన్నారు.


రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

పెద్దశంకరంపేట, ఏప్రిల్‌ 22 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికభివృద్ది చెందాలని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మీరమేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, సర్పంచ రాములు, పీఏసీఎస్‌ చైర్మన సంజీవరెడ్డి, ఎంపీటీసీలు వీణాగౌడ్‌, స్వప్న, దామోదర్‌, యాదుల్‌,  సురే్‌షగౌడ్‌, శంకర్‌గౌడ్‌, అంజయ్య, అశోక్‌, కిషన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:43:48+05:30 IST