పుట్టిన ఊరు గొప్పతనం మరువలేనిది

ABN , First Publish Date - 2021-10-17T04:54:24+05:30 IST

పుట్టిన ఊరు గొప్పతనం ఎన్నటికీ మరువలేనిదని కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య అన్నారు.

పుట్టిన ఊరు గొప్పతనం మరువలేనిది

- కిన్నెర కళాకారుడు మొగులయ్య


తెలకపల్లి, అక్టోబరు 16: పుట్టిన ఊరు గొప్పతనం ఎన్నటికీ మరువలేనిదని కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని గట్టురాయిపాకుల గ్రామంలో 12 మెట్ల కిన్నెర మొగులయ్యను గ్రామ సర్పంచ్‌ తగిలి లక్ష్మిశ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌రావు, ఉప సర్పంచ్‌ నాగయ్యల ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ ఎంత ఎదిగినా తన మూలాలు గట్టురాయిపాకుల తన స్వంత గ్రామంలోనే ఉన్నాయని, తన గ్రామం తనకు ఎంతో ఇష్టమని తన తోటివారితో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం 12 మెట్ల కిన్నెరను వాయించి పాటల ద్వారా అలరించారు.  

 

Updated Date - 2021-10-17T04:54:24+05:30 IST