వరకట్నం నిరాకరించిన వరుడు.. వధువు కుటుంబీకులకు ఎలాంటి నిబంధన విధించాడో తెలుసా..

ABN , First Publish Date - 2022-01-30T22:19:30+05:30 IST

అడిగినంత కట్నం ఇవ్వలేదనో, మర్యాదల్లో లోటుపాట్లు ఉన్నాయనే కారణంతో చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసిన సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి సందర్భాల్లో పరువు పోయిందనే బాధలో కొందరు యువతులు..

వరకట్నం నిరాకరించిన వరుడు.. వధువు కుటుంబీకులకు ఎలాంటి నిబంధన విధించాడో తెలుసా..

ఒక్కోసారి వివాహం నిశ్చయమైనప్పటి నుంచి పెళ్లి తంతు పూర్తయ్యే వరకూ ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. ప్రధానంగా వరకట్నం తదితర అంశాల్లో సమస్యలు తలెత్తుతుంటాయి. తాళి కట్టేవరకూ పెళ్లి సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం ఉండదు. అడిగినంత కట్నం ఇవ్వలేదనో, మర్యాదల్లో లోటుపాట్లు ఉన్నాయనే కారణంతో చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసిన సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి సందర్భాల్లో పరువు పోయిందనే బాధలో కొందరు యువతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. హర్యానాలో వరకట్నం నిరాకరించిన వరుడి కుటుంబ సభ్యులు.. చివరకు వధువు కుటుంబీకులకు ఎలాంటి నిబంధన పెట్టారంటే..


హర్యానాలోని సిర్సా జిల్లా చౌతాలా గ్రామానికి చెందిన పవన్ సిహాగ్‌ కుమారుడు మనీష్. అతడికి ఇటీవల నాథుసారి కలాన్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జుగాలాల్ కస్నియా మనువరాలు మనీషాతో పెళ్లి నిశ్చయమైంది. ఈ సమయంలో వేరే ఎవరైనా, కట్నకానుకల గురించి మాట్లాడుకుంటారు. అయితే మనీష్, మనీషా కుటుంబీకులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ఈ వివాహం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తామే మొదటి అడుగు వేయాలని సిద్ధపడ్డారు. ముందుగా వరకట్నాన్ని రద్దు చేసుకున్నారు.

ఈ వధువుకు మోయలేనంత గిఫ్ట్ వచ్చింది.. సోదరులు ఇచ్చిన బహుమతి చూసి బంధువులంతా ఖంగుతిన్నారు..



కట్నం కింద కేవలం ఒక్క రూపాయితో పాటూ ఒక కొబ్బరికాయ మాత్రమే తీసుకురావాలని వధువు కుటుంబీకులకు.. వరుడితో పాటూ అతడి తల్లిదండ్రులు సూచించారు. అలాగే వివాహ కార్యక్రమంలో మద్యం వినియోగించకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వారు మాట్లాడుతూ చాలా మంది ధనవంతులు.. వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులు చేస్తున్నారన్నారు. తమ వివాహ వేడుక ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నట్లు వరుడి తండ్రి పేర్కొన్నాడు. తమ బంధువుల్లో కూడా ఇలాంటి మార్పు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో వీరి నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు.

పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..

Updated Date - 2022-01-30T22:19:30+05:30 IST