మైదానాలను చక్కగా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:43:33+05:30 IST

గ్రామీణ క్రీడాప్రాంగణాలను చక్కగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ శరత్‌ సూచించారు.

మైదానాలను చక్కగా ఏర్పాటు చేయాలి

 సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌


నారాయణఖేడ్‌, జూన్‌ 29 : గ్రామీణ క్రీడాప్రాంగణాలను చక్కగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ శరత్‌ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో  మాట్లాడారు.  గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మైదానాలను ఏర్పా టు చేయాలన్నారు. మైదానాల్లో ఖోఖో కోర్టులు ఖచ్ఛితంగా ఉండాలన్నారు గ్రామాల సరిహద్దుల్లో స్వాగతం, ధన్యవాదం బోర్డులు ఉండాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాలన్నారు. రైతుబం ధు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నారాయణఖేడ్‌ మండలంలో కొత్తగా 1,651 మంది దరఖాస్తులు చేసుకున్నారని ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఏవో శంకర్‌ తెలిపారు. రైతులు మరణిస్తే వ్యవసాయాధికారులు వారి కుటుంబసభ్యులను పరామర్శించాలని సూచించారు. రెవెన్యు పథకాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని తహసీల్దార్‌ దశరథ్‌సింగ్‌కు సూచించారు. సమావేశంలో ఆర్డీవో అంబాదా్‌సరాజేశ్వర్‌, కమిషనర్‌ మల్లారెడ్డి, తహసీల్దార్‌ దశరథ్‌సింగ్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఏవో శంకర్‌ పాల్గొన్నారు. 


జిల్లా గణాంక దర్శినిని ఆవిష్కరించిన కలెక్టర్‌

సంగారెడ్డిఅర్బన్‌: శాస్త్రవేత్త, గణాంత నిపుణుడు ఫ్రొఫెసర్‌ పీసీ మహలనోబిస్‌ జన్మదినం సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ముఖ్యప్రణాళికా విభాగం వారు తయారుచేసిన సంగారెడ్డి గణాంక దర్శిని 2020-21 పుస్తకాన్ని కలెక్టర్‌ శరత్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జిల్లాకు సంబంధించిన అన్నిశాఖల అభివృద్ధి వివరాలతో కూడిన గణాకాంలను సమీకరించి తయారుచేశారని, సామాన్య ప్రజలకు, ప్రభుత్వ ఇతర సంస్థలకు, ప్రణాళికలు తయారు చేయడానికి పరిశోధకులకు స్వచ్చంద సంస్థలకు ఉపయోగపడుతుందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో సీపీవో మనోహర్‌, డీఆర్‌డీవో శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు, పరిశ్రమలశాఖ జీఎం ప్రశాంత్‌కుమార్‌, పలువరు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:43:33+05:30 IST