తెలంగాణ గుండె చప్పుడు ఒగ్గుడోలు

ABN , First Publish Date - 2022-07-06T05:42:01+05:30 IST

తెలంగాణ సాధన ఉద్యమంలో ఒగ్గుడోలు చప్పులు ఢిల్లీ గద్దె కదలండంతో ఒగ్గుడోలు తెలంగాణ గుండె చప్పుడుగా మారిపోయిందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

తెలంగాణ గుండె చప్పుడు ఒగ్గుడోలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

మంథని, జూలై 5: తెలంగాణ సాధన ఉద్యమంలో ఒగ్గుడోలు చప్పులు ఢిల్లీ గద్దె కదలండంతో ఒగ్గుడోలు తెలంగాణ గుండె చప్పుడుగా మారిపోయిందని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా ఒగ్గు డోలు విన్యాసాల్లో శిక్షణ పొందిన కళాకారులకు ధ్రువీకరణ పత్రాలను పుట్ట మధు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒగ్గు డోలు కళను అభివృద్ధి చేయాలనే తప్పనతోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ధ్రువీకరణ పత్రాలను ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే పత్రాలకు భవిష్యత్‌లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. హైదరాబాద్‌ బోనాల సందడిలో ఎక్కడ చూసిన ఒగ్గుడోలు సందడే కనిపిస్తుందన్నారు. మన సంస్కృతి ప్రతిబింబమైన ఇలాంటి కళ లను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో మంథ ని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, తగరం శంక ర్‌లాల్‌, కనవేన శ్రీనివాస్‌, కిరణ్‌, సతీష్‌, సత్యనారాయణలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-06T05:42:01+05:30 IST