Heartwarming Video: ఇలాంటి కొడుకు ఉన్నాడు.. ఆ తల్లికి ఇంకేం కావాలి.. వైరల్ వీడియో.. మీరూ చూడండి..

ABN , First Publish Date - 2022-05-10T20:19:14+05:30 IST

ఈ యువకుడి పేరు అమన్ ఠాకూర్. వయసు 24 సంవత్సరాలు. తల్లి ప్రోత్సాహంతో..

Heartwarming Video: ఇలాంటి కొడుకు ఉన్నాడు.. ఆ తల్లికి ఇంకేం కావాలి.. వైరల్ వీడియో.. మీరూ చూడండి..

‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అని సుమతీ శతకంలో తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందో చెప్పారు. కానీ.. తల్లి కూడా కొడుకు వృద్ధిలోకి వస్తే మురిసిపోతుందన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదో. బహుశా.. తల్లి ప్రేమను వర్ణించడానికి అక్షరాలు సరిపోవని బద్దెన కవి భావించి ఉండొచ్చు. అయితే.. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ అమ్మకు కొడుకు ఆమె జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాన్ని పరిచయం చేశాడు. ఈ యువకుడి పేరు అమన్ ఠాకూర్. వయసు 24 సంవత్సరాలు. తల్లి ప్రోత్సాహంతో Pilot అవ్వడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టానికి ప్రతిఫలంగా అమన్ ఠాకూర్ IndiGo Airlinesలో Pilot అయి ఆ తల్లి కళ్లలో సంతోషాన్ని నింపాడు.



ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. అమన్ ఠాకూర్ తల్లి కూడా ఇండిగో పైలటే. మే 8న Mothers Day సందర్భంగా Aman Thakur తన తల్లికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆమె పైలట్‌గా ఉన్న విమానానికే అమన్ కూడా Co-Pilotగా వచ్చాడు. వస్తూనే.. తన తల్లిని Surprise చేసి ఆమెకు మాతృ‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్చం ఇచ్చాడు. ఈ 24 ఏళ్ల జీవితంలో తన తల్లి పైలట్‌గా ఉన్న విమానంలో ప్రయాణికుడిగా ప్రయాణం చేసిన తాను, ఇప్పుడు కో-పైలట్‌గా ఆమెతో కలిసి ప్రయాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అమన్ ఠాకూర్ చెప్పాడు. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులకు తన తల్లితో ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంగా పంచుకున్నాడు. అతని మాటలు యథాతథంగా..



‘‘ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. నా పేరు అమన్ ఠాకూర్. దయచేసి కొంతసేపు మీతో మాట్లాడొచ్చా? మదర్స్ డే సందర్భంగా మీరంతా అమ్మపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరిచి ఉంటారు. ఈ Mothers Day సందర్భంగా మా అమ్మ గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ 24 ఏళ్ల జీవితంలో మా అమ్మతో కలిసి పలు విమానాల్లో, పలు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేశాను. అయితే.. ఇవాళ మాత్రం నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇప్పుడు ఇండిగోలో ఆమె పైలట్‌గా ఉన్న ఫ్లైట్‌కు నేను కో-పైలట్‌గా వచ్చాను. నా కోసం ఇన్ని సంవత్సరాలు ఎంతో చేసిన మా అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కోసం నిలబడినందుకు థ్యాంక్యూ అమ్మా’’ అని అమన్ ఠాకూర్ భావోద్వేగంతో మాట్లాడిన మాటలకు ప్రయాణికుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొడుకు కోసం ఎంతో చేసిన ఆ అమ్మను, ఆ అమ్మ కోరికను నెరవేర్చిన కొడుకును ప్రశంసిస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Updated Date - 2022-05-10T20:19:14+05:30 IST