ధాన్యం కొనుగోలులో అవకతవకలపై రాజుకుంటున్న వేడి

ABN , First Publish Date - 2021-10-09T05:01:41+05:30 IST

చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవకతవకల కేసులో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తుండటంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. విపక్షాల నాయకులు నేడు చేర్యాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఓవైపు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ కొనసాగిస్తూ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే పీఏసీఎస్‌ చైర్మన్‌ సహా ముగ్గురు మిల్లర్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌, రేణుకా పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు సీజ్‌ అయ్యాయి.

ధాన్యం కొనుగోలులో అవకతవకలపై రాజుకుంటున్న వేడి
చేర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న విపక్ష నాయకులు (ఫైల్‌)

సమగ్ర విచారణకు ప్రతిపక్షాల పట్టు

నేడు చేర్యాల బంద్‌కు పిలుపు


చేర్యాల, అక్టోబరు 8 : చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవకతవకల కేసులో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తుండటంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. విపక్షాల నాయకులు నేడు చేర్యాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఓవైపు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ కొనసాగిస్తూ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే పీఏసీఎస్‌ చైర్మన్‌ సహా ముగ్గురు మిల్లర్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌, రేణుకా పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు సీజ్‌ అయ్యాయి. 


కస్టడీకి కోరిన పోలీసులు

నకిలీ ట్రక్‌షీట్లు సృష్టించి బినామీ ఖాతాలో డబ్బు జమ చేసిన బాగోతంలో కీలక నిందితుడైన పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగ చంద్రారెడ్డి, మిల్లర్‌ గంపా రాజును కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరినట్లు తెలిసింది. అయితే వారు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులతో పాటు అధికారులు బ్యాంకుఖాతాదారులను విచారిస్తున్నారు. అవినీతి బాగోతానికి పరోక్షంగా సహకరించారన్న కారణంగా చర్యలు తప్పవన్న ప్రచారం సాగుతుండటంతో బినామీ ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా గురువారం సాయంత్రం నుంచి పలువురి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయి. అయితే సివిల్‌సప్లయిస్‌, పీఏసీఎస్‌ ఉన్నతాధికారుల సహకారం లేనిదే ఇంతపెద్దమొత్తంలో అవినీతి జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


బంద్‌పై విపక్ష నాయకులకు నోటీసులు

ప్రతిపక్ష పార్టీల నాయకులు సమగ్ర విచారణకు పట్టుబడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దశలవారీగా ఆందోళనలు కొన సాగిస్తున్నారు. విపక్షాలు నేడు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఈ ఆరోపణలపైనా అధికార పార్టీ కూడా చాకచక్యంగా పావులు కదుపుతుంది. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధికారులను కోరడంతో పాటు టీఆర్‌ఎస్‌  నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నేటి చేర్యాల బంద్‌పై పోలీసులు రంగంలోకి దిగారు. 30 పోలీ్‌సయాక్ట్‌ అమలులో ఉన్నందున ఆందోళనలో పాల్గొనరాదని పేర్కొంటూ ఆయా పార్టీల నాయకులకు పోలీసులు నోటీసులను జారీ చేశారు.


ఐకేపీ అధికారులు, సిబ్బంది సస్పెన్షన్‌

ధాన్యం కొనుగోలు అవినీతి బాగోతంపై కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి కొరడా ఝుళిపించారు. డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో అవకతవకలు నిర్ధారణ కావడంతో ఐకేపీ అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆరుగురు సీఏ(డీవోఎల్‌)లతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి పర్యవేక్షించని కారణంగా చేర్యాల ఏపీఎం శ్రీనివా్‌సరెడ్డి, కొమురవెల్లి ఏపీఎం ప్రకాశం, ముగ్గురు సీసీలను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఈవిషయమై వారికి ఉత్తర్వులు అందించినట్లు సమాచారం. 

Updated Date - 2021-10-09T05:01:41+05:30 IST