
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ త్వరలో పెళ్లాడబోతున్నట్టు గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు. తమ పెళ్లి నుంచి మీడియా దృష్టిని మరల్చడానికే ఈ పెళ్లి వార్తలను వారు ఖండిస్తున్నట్టు తెలుస్తోంది.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం రాజస్థాన్‌లోని ఒక మహల్లో జరగబోతున్నట్టు తెలుస్తోంది. సవాయ్ మాదోపూర్లోని 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కోటలో వీరు పెళ్లాడబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో వీరి వివాహం జరగబోతుందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.

సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో 2 ప్యాలెస్‌లు, 2 గుళ్లు ఉన్నాయి. ఈ కోట 5.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని చుట్టూ 6 మీటర్ల ఎత్తులో ప్రహరీ గోడ ఉంది. ఈ మహల్ లోపల 48 గెస్ట్ సూట్లు ఉన్నాయి. రణతంబోర్ నేషనల్ పార్కుకు కొన్ని కిలో మీటర్ల దూరంలోనే ఈ మహల్ ఉంది.
వీరి వివాహం డిసెంబరు 7 నుంచి 11 మధ్యలో జరగనుంది. ఈ తేదీల మధ్య రిసార్ట్ లో గదులు అన్ని బుక్ అయ్యాయి. విక్కీ కౌశల్ తండ్రిని వీరి వివాహం గురించి అడగగా ఆయన స్పందించడానికి నిరాకరించారు. సూట్లో ఒక రోజు ఉండటానికి రూ.65వేల నుంచి రూ.1.22లక్షల వరకు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. కత్రినా పెళ్లిలో ధరించే దుస్తులను సబ్యసాచి డిజైన్ చేయనున్నారు.