ముగిసిన శరన్నవరాత్రులు

ABN , First Publish Date - 2022-10-07T05:55:43+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం విజయదశమి పర్వదినంతో ముగిశాయి.

ముగిసిన శరన్నవరాత్రులు
వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు, భక్తుల సందడి

భక్తులతో కిక్కిరిసిన విద్యాధరి, మర్పడగ ఆలయాలు

వర్గల్‌/కొండపాక/చేర్యాల, అక్టోబరు 6 : శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం విజయదశమి పర్వదినంతో ముగిశాయి. వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో విజయదశిమి పర్వదినం సందర్భంగా విద్యా సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి ఎదుట జమ్మి కొమ్మలు శమి పూజ నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా విద్యా సరస్వతీ అమ్మవారిని భక్తులు అధికంగా దర్శించుకున్నారు. కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రానికి భక్తులతో పోటెత్తారు. క్షేత్ర నిర్వాహకులు డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని పట్టువస్త్రాలతో గజమాలలతో అలంకరించారు. విజయదుర్గామాత భక్తులకు రాజరాజేశ్వరిదేవిగా దర్శనం ఇచ్చింది. సాయంత్రం జరిగిన శమీపూజలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని హరనాథ్‌శర్మ శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం రావణదహన కార్యక్రమం జైశ్రీరామ్‌ నినాదాల మధ్య నయనానందకరంగా జరిగింది. కొముర వెల్లి మల్లన్న ఆలయంలో దేవీ త్రిరాత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా దుర్గాదేవికి విశేషపూజలు నిర్వహించిన అనంతరం కలశోద్వాసన చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించి ఆలయ ఆవరణలోని కోనేరులో నిమజ్జనం చే శారు. 

Updated Date - 2022-10-07T05:55:43+05:30 IST