గిన్నెధరిలో ఇల్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-09-19T04:39:48+05:30 IST

మండలంలోని గిన్నెధరి గ్రామంలో శనివారం తెల్లవారు జామున మడావి అనంతరావుకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది.

గిన్నెధరిలో ఇల్లు దగ్ధం
తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో కాలిపోయిన ఇల్లు

తిర్యాణి, సెప్టెంబరు 18: మండలంలోని గిన్నెధరి గ్రామంలో శనివారం తెల్లవారు జామున మడావి అనంతరావుకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో ఇంట్లోని సామగ్రితో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు కాలిపోయాయి. కాగా ఇంటి ముందు ఉన్న ఎద్దుకు స్వల్ప గాయాలయ్యాయి. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధి తుడికి వంట పాత్రలు, వంట సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ అర్చన, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తాళ్ల శ్రీనివాస్‌ఔడ్‌, నాయకులు రాజయ్య, శంకర్‌గౌడ్‌, మధుకర్‌, బ్రహ్మం, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:39:48+05:30 IST