ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-05-07T06:04:31+05:30 IST

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రెండో విడత కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఎందరోమంది ఇబ్బందులు పడుతున్నారని ఈ కరోనా వైరస్‌ను అరికట్టేందుక ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తుందన్నారు.

ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌ పట్టణంలో సర్వే నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

తలమడుగు, మే6: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో  మాట్లాడుతూ రెండో విడత కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది ఎందరోమంది ఇబ్బందులు పడుతున్నారని ఈ కరోనా వైరస్‌ను అరికట్టేందుక ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తుందన్నారు. కుటుంబ సర్వే వివరాలు, వారి ఆరోగ్య విషయాలు తెలుసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నతాదికారులకు అందించాలన్నారు. అంతేకాకుండా వారం రోజులుగా జ్వరాలతో, కరోనా వైరస్‌ అనుమానం ఉంటే వైద్య సిబ్బంది అందించే మెడికల్‌ కిట్‌ను తీసుకొని కరోనా నివారణకు సహకరించాలన్నారు. మహారాష్ట్ర నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్‌ను తీసుకోవాలన్నారు. ఇందులో ఎంపీడీవో రమాకాంత్‌,  మండల వైద్యాధికారి రాహుల్‌, ఎంపీడీవో దిలీప్‌కుమార్‌, పంచాయతీ సెక్రటరీలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: మండలంలో చేపడుతున్న ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని బోథ్‌ సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ కోరారు. గురువారం బోథ్‌లో వైద్య సిబ్బంది సర్వే తీరును పరిశీలించారు. కరోనా పాజిటివ్‌ ఉన్నట్లయితే హోం క్వారంటైన్‌లో ఉండేందుకు గాను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సిద్ధం చేశామన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని కోరారు.

సిరికొండ: కరోనా నియంత్రణలో భాగంగా మండలంలో ఇంటింటి సర్వే చేపట్టారు. గురువారం ఎంపీడీవో సురేష్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సర్పంచ్‌ చంద్ర కళతో కలిసి పొన్న గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారు కొవిడ్‌యాప్‌, మీసేవ కేంద్రాల ద్వారా పేర్లను నమోదు చేసుకొని నర్సాపూర్‌ లేదా పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని సూచించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి అజ్మత్‌, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని గురువారం పట్టణంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీల్లో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు,ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి  కుటుంబ సభ్యుల సంఖ్య, వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వే 15 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఇందులో ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు తదితరులున్నారు.

భీంపూర్‌: ఇంటింటా సర్వేతో కుటుంబాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కొవిడ్‌ లక్షణాలు ఉంటే కిట్లు అందజేస్తామని తహసీల్దార్‌ సోము అన్నారు. గురువారం ఆయన ఎంపీడీవో శ్రీనివాస్‌, వైద్యాధికారి నిలోఫర్‌తో కలిసి మండల కేంద్రం భీంపూర్‌లో ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ మండలంలో 5వేల కుటుంబాలు, 27 వేల జనాభా ఉన్నదని ఇందుకు గాను 31 సర్వే బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి బృందంలో  అంగన్‌వాడీ, ఆశా, వీఆర్వో, వీఆర్‌ఏ, వీఓఏ, తదితరులు ఉంటారని పేర్కొన్నారు. 26 పంచాయతీలు అనుబంధ గ్రామాల్లో 31 బృందాలు పక్కగా ఆరోగ్య సర్వే చేసి గడువులోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. పక్క ప్రణాళికతో ఈ సర్వేలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటు కొవిడ్‌ను 100శాతం నియంత్రిస్తామన్నారు. వారితో సర్పంచ్‌ మడావి లింబాజి, ఉప సర్పంచ్‌ రవీందర్‌,  కార్యదర్శి సాయినాథ్‌, ఆశలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T06:04:31+05:30 IST