పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..

Published: Thu, 18 Aug 2022 19:22:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..ప్రతీకాత్మక చిత్రం

భార్యాభర్తల మధ్య సమస్యలనేవి సహజం. కొన్నాళ్లు పోతే అవే సర్దుకుంటాయని కుటుంబ పెద్దలు చెబుతుంటారు. వారు చెప్పినట్లుగానే కొన్నాళ్లకు దంపతులు మళ్లీ కలిసిపోవడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని, చివరికి విడాకుల వరకూ వెళ్తుంటారు. మరికొన్ని సార్లు ఒకరిమీద ఒకరు కక్ష పెంచుకుని దారుణాలకు తెగబడుతుంటారు. హర్యానా రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లిన భర్త.. చివరకు భార్య గదిలో దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..

హర్యానా (Haryana) రాష్ట్రం ధైజ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గౌతమ్‌బుద్ నగర్ జిల్లా ఖగోడా గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తి.. ధైజ్ పరిధి  ఇందిరా కాలనీ ప్రాంతానికి చెందిన యువతితో 13ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే నాలుగేళ్లుగా భార్యాభర్తల మధ్య సమస్యలు (Differences between husband and wife) తలెత్తాయి. దీంతో ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో రెండు నెలల క్రితం ఫరూక్ భార్య తన పుట్టింటికి వచ్చింది. దీంతో పలుమార్లు భార్యను తీసుకురావడానికి వెళ్లినా.. ఆమె తల్లిదండ్రులు పంపించలేదు.

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..

ఇటీవల ఓ రోజు భార్యను తీసుకొచ్చేందుకు మళ్లీ అత్తగారింటికి వెళ్లాడు. అయితే ఆమె మాత్రం రానని తేల్చిచెప్పింది. దీంతో తన పిల్లలను బలవంతంగా తీసుకుని సొంతూరుకు వచ్చాడు. వారిని ఇంట్లో వదిలి శనివారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లాడు. గదిలో భార్య ఒక్కటే నిద్రపోతుండడం చూసి.. కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉన్నట్టుండి కూతురిని రక్తపు మడుగులో విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

విధిరాత అంటే ఇదేనేమో.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఈ యువకుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..Honor Killing: కన్న కూతురిని చంపి నడిరోడ్డుపై పారేసిన తండ్రి.. శవం ఎవరిదో గుర్తు పట్టకూడదని తలను నరికి..Viral photo: చెట్లే తన ఆవాసం.. రాత్రిళ్లు రంగు రంగు బొమ్మలతో సావాసం.. అంతా కూతురి కోసమే అంటున్న తండ్రి.. snake moves with legs: కాళ్లతో నడుస్తున్న పాము.. విచిత్రంగా ఉంది కదా.. చూస్తే వావ్! అనాల్సిందే..videoఇన్నాళ్లూ.. తమ కూతురు కాలుజారి కాలువలో పడిందనుకున్నారు.. కానీ ఇంట్లో పరుపు శుభ్రం చేస్తుండగా.. బయటపడిన పేపర్‌తో..ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.