నాలుగు నెలల క్రితం పెళ్లి.. మధ్యాహ్నం భోజనానికని వెళ్తే ఇంట్లో కనిపించని భార్య.. సాయంత్రానికల్లా షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-11-23T21:31:59+05:30 IST

కర్నాటకలో నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంట కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేది. అయితే ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు.. భార్య కనిపించకపోయే సరికి ఆందోళన చెందాడు.

నాలుగు నెలల క్రితం పెళ్లి.. మధ్యాహ్నం భోజనానికని వెళ్తే ఇంట్లో కనిపించని భార్య.. సాయంత్రానికల్లా షాకింగ్ సీన్..!

పెళ్లైన కొత్తలో ఏ కుటుంబంలో అయినా మంచి వాతావరణం ఉంటుంది. కొందరైతే జీవితాంతం అదే అనుబంధాన్ని కొనసాగిస్తూ.. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారు. మధ్య మధ్యలో ఏవైనా సమస్యలు ఉన్నా.. సరిదిద్దుకుని జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటారు. మరికొందరైతే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ కాపురాన్ని.. కలహాలమయంగా చేసుకుంటారు. తద్వారా ఇద్దరికీ మనశ్శాంతి లేకపోవడంతో పాటూ కుటుంబ సభ్యులకు కూడా తలనొప్పులు తెస్తుంటారు. కర్నాటకలో నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంట కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేది. అయితే ఓ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు.. భార్య కనిపించకపోయే సరికి ఆందోళన చెందాడు. సాయంత్రానికి అతనికి విషయం తెలియడంతో షాక్ అయ్యాడు..


కర్ణాటకలోని తుమకూరు తుమకూరు జిల్లా.. కునిగల్ తాలూకా కెంపసాగర్ గ్రామానికి చెందిన మునిస్వామి(26), కునిగల్ పట్టణంలో కిరాణా దుకాణం నడుపుకొంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి(22) అనే యువతితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భర్త కిరాణా దుకాణంలో ఉంటే, భార్య ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. ఇలా సవ్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో సమస్యలు వచ్చి పడ్డాయి. భర్త చేసిన పని భార్యకు నచ్చక.. భార్య చేసే పనులు భర్తకు నచ్చకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. పెళ్లయి రెండు నెలలు కాకముందే.. వారి జీవితం సమస్యలమయంగా మారింది. పెద్దలు సర్దిచెబుతున్నా వారి తీరు మాత్రం మారేది కాదు.


ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మునిస్వామి భోజనానికి ఇంటికొచ్చాడు. అయితే భార్య ఇంట్లో లేకపోవడంతో షాక్ అయ్యాడు. చెప్పకుండా ఎక్కడకు వెళ్లుంటుందని కంగారుపడ్డాడు. తర్వాత విచారిస్తే అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లిందని తెలిసింది. అక్కడకు వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. తర్వాత మునిస్వామి షాపుకెళ్లాడు. అతడి తల్లిదండ్రులు పొలంలో పనుంటే వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన అత్తమామలు.. ఇంట్లో కోడలు ఉరికి వేలాడుతూ ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే కొడుక్కి సమాచారం అందించారు. భార్య చనిపోయిందని తెలియగానే ఆందోళనతో.. మునిస్వామి కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరలక్ష్మి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పెళ్లయిన నాలుగు నెలలకే ఇలా జరగడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-23T21:31:59+05:30 IST