మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట.. వెళ్లి చూసొస్తా.. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య కోరిక.. సరేనని ఆ భర్త పంపిస్తే..

ABN , First Publish Date - 2022-01-29T01:17:41+05:30 IST

ఇటీవల మధ్యప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య పుట్టింటికి వెళ్లొస్తానని పట్టుబట్టింది. ‘‘మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట, వెళ్లి చూసొస్తాను’’ అంటూ చెప్పింది. సరేనంటూ పంపించిన భర్త.. చివరకు అసలు నిజం తెలిసి షాక్ అయ్యాడు...

మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట.. వెళ్లి చూసొస్తా.. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య కోరిక.. సరేనని ఆ భర్త పంపిస్తే..

ప్రస్తుత సమాజంలో వివాహ బంధాలను చాలా మంది అపహాస్యం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాలకు అర్థాలనే మారుస్తున్నారు. కట్నం, ఆస్తుల కోసమే పెళ్లిళ్లు చేసుకునే స్థాయికి దిగజారారు. వివాహానంతరం వారి మధ్య కేవలం ఆర్థిక లావాదేవీలు తప్ప.. అనుబంధాలు లేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చాలా మంది హత్యలు చేయడమో లేక ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య పుట్టింటికి వెళ్లొస్తానని పట్టుబట్టింది. ‘‘మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట, వెళ్లి చూసొస్తాను’’ అంటూ చెప్పింది. సరేనంటూ పంపించిన భర్త.. చివరకు అసలు నిజం తెలిసి షాక్ అయ్యాడు...


మధ్యప్రదేశ్‌ సాలుంబర్ అనే ప్రాంతంలో దుర్జన్‌సింగ్‌ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న ఇతడికి.. స్థానికంగా ఉన్న హేమ్‌రాజ్ సింగ్, విష్ణు జోషి అనే వ్యక్తులు పరిచయమయ్యారు. దుర్జన్‌సింగ్‌‌తో రూ.2.50లక్షలు తీసుకున్న ఈ ఇద్దరు వ్యక్తులు.. ఆరు నెలల క్రితం సోను యాదవ్ అనే యువతితో సంబంధం ఖాయం చేసి పెళ్లి చేశారు. కొన్ని రోజులు భర్తతో అన్యోన్యంగా ఉన్న సోను, ఓ రోజు ఉన్నట్టుండి ‘‘తన తల్లికి ఒంట్లో బాలేదు.. వెళ్లి చూసొస్తాను’’.. అని భర్తతో చెప్పి పుట్టింటికి వెళ్లింది. అయితే ఎన్ని రోజులైనా రాకపోవడంతో విచారించగా ఆచూకీ లభించలేదు. దుర్జన్‌సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నా భార్యను కిడ్నాప్ చేశారంటూ ఓ భర్త కేసు.. చివరగా ఇంట్లోనే ఆమె ఫోన్ స్విచాఫ్.. విచారణలో బయపటడిన ఘోరమిది..!


పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోనూ యాదవ్‌కు పదేళ్ల క్రితమే శిఖర్‌పూర్ గ్రామానికి చెందిన అరవింద్ యాదవ్‌తో వివాహమై, ఆరేళ్ల కుమార్తె కూడా ఉందని తెలిసింది. అరవింద్ యాదవ్‌ కేన్సర్ కారణంగా చనిపోవడంతో సోనూ కొన్నాళ్లు ఒంటరిగానే జీవనం సాగించింది. ఈ క్రమంలో గులాబ్ సింగ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రోద్భలంతో కొందరు ముఠాగా ఏర్పడి, పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేయడం ప్రారంభించారు. ఇందుకు గులాబ్ సింగ్ భార్య రజనీ అరాయ్ రేఖ కూడా తోడైంది. కొందరు ఏజెంట్లను నియమించుకుని పెళ్లికాని యువకులకు గాలం వేస్తున్నారు. పెళ్లయిన తర్వాత నగలు, నగదుతో ఉడాయించడం చేస్తుండేవారు. తాజాగా నెల క్రితం కూడా నింబహెరాకు చెందిన రూప్‌లాల్ తేలీని కూడా వివాహం చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. ఇలా వివిధ వ్యక్తులను మోసం చేయడం ద్వారా వచ్చిన డబ్బును ముఠా సభ్యులంతా పంచుకునేవారని పోలీసులు పేర్కొన్నారు.

ఎముకలు కొరికే చలిలో దుప్పటి కప్పుకుని మరీ బైక్‌పై భార్యాభర్తల ప్రయాణం.. మధ్యలో ఆరేళ్ల కొడుకు శవం..!

Updated Date - 2022-01-29T01:17:41+05:30 IST