గుజరాతీ యువతుల హల్చల్
ABN , First Publish Date - 2021-07-26T05:11:26+05:30 IST
పట్టణ శివారులోని డంపింగ్యార్డు వద్ద గల అంతరాష్ట్ర రహదారిపై వాహనాలను నిలుపుదల చేసి డబ్బులు ఇవ్వాలంటూ కొంతమంది గుజరాతీ యువతులు హల్చల్ చేశారు.
పార్వతీపురంటౌన్, జూలై 25: పట్టణ శివారులోని డంపింగ్యార్డు వద్ద గల అంతరాష్ట్ర రహదారిపై వాహనాలను నిలుపుదల చేసి డబ్బులు ఇవ్వాలంటూ కొంతమంది గుజరాతీ యువతులు హల్చల్ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల యువతులు కార్లు, ఆటోలు, మోటార్ బైక్లను నిలుపుదల చేసి రూ.100 నుంచి రూ.200 వసూలు చేయడం ప్రారంభించారు. ఇంతలో కొంతమంది వాహనచోదకులు పట్టణ పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ కళాధర్, సిబ్బంది యువతలను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. మళ్లీ ఇలా డబ్బులు వసూలు చేయరాదని ఎస్ఐ యువతులకు హెచ్చరించి, పట్టణం నుంచి పంపించారు.