బుద్ధుడి ఆలోచనలు ప్రపంచానికే ఆదర్శం

ABN , First Publish Date - 2021-03-01T06:25:52+05:30 IST

గౌతమ బుద్ధుడి ఆ లోచనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని, శాంతి సందేశాన్ని వినిపించాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు.

బుద్ధుడి ఆలోచనలు ప్రపంచానికే ఆదర్శం
నాగార్జునసాగర్‌లోని బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

నాగార్జునసాగర్‌, ఫిబ్రవరి 28: గౌతమ బుద్ధుడి ఆ లోచనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని, శాంతి సందేశాన్ని వినిపించాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. బుద్ధవనం ప్రాజెక్ట్‌ పనులను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, రాంబల్‌ నాయక్‌లతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అభివృ ద్ధికి నోచని ఇలాంటి బౌద్ధ పర్యాటక కేంద్రాలు తెలం గాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చొరవతో అభివృద్ధి చెం దుతున్నాయన్నారు. ప్రాజెక్ట్‌ ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. బుద్ధవనంలో మొక్కలు నాటి, బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఽస్థూప మందిరంలో ధ్యానం చేశారు. అనంతరం సాగర్‌ ప్రాజెక్ట్‌ జల విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. సాగర్‌కు చేరుకున్న ఆయనకు అసిస్టెంట్‌ సోషల్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి వెంకట కృష్ణయ్య స్వాగతం పలికారు. 

Updated Date - 2021-03-01T06:25:52+05:30 IST