Visakha: చెత్త పన్నుపై ఆగని ప్రజల ఆగ్రహం...వీడియోలు హల్‌చల్

ABN , First Publish Date - 2022-05-25T17:49:20+05:30 IST

వైసీపీ సర్కార్ చెత్తకు పన్ను విధించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఇంకా కొనసాగుతోంది.

Visakha: చెత్త పన్నుపై ఆగని ప్రజల ఆగ్రహం...వీడియోలు హల్‌చల్

విశాఖపట్నం: వైసీపీ సర్కార్ చెత్తకు పన్ను విధించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఇంకా కొనసాగుతోంది. చెత్త పన్ను కోసం వెళ్తున్న వారిని ప్రజలు నిలదీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. చెత్త పన్ను వసూళ్లు చెయ్యడానికి వచ్చిన వారికి ..పన్ను ఎందుకు కట్టాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఇంటి పన్ను కడుతున్నాము కదా? మళ్లీ చెత్త పన్ను ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. సరైన సమాధానం చెప్పలేక జీవీఎంసీ అధికారులు నీళ్లు నములుతున్న పరిస్థితి నెలకొంది. పన్ను కడితేనే.. చెత్తను తీసుకు వెళ్తామని, లేకపోతే లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో జీవీఎంసీ అధికారులు తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. 

Updated Date - 2022-05-25T17:49:20+05:30 IST