పెరిగిన భారం రాష్ర్టానిదే

ABN , First Publish Date - 2021-07-27T08:01:22+05:30 IST

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం తేల్చేసింది. 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వా త పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలం టూ

పెరిగిన భారం రాష్ర్టానిదే

పోలవరంపై తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

2013-14 అంచనా 20,398 కోట్లకే పరిమితమన్న కేంద్రం

రాజ్యసభలో విజయసాయి ప్రశ్నకు మంత్రి షెకావత్‌ జవాబు

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’


అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం తేల్చేసింది. 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే పరిమితమవుతామని, ఆ తర్వా త పెరిగే అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలం టూ కుండబద్దలు కొట్టింది. తద్వారా పోలవరం సాగు నీటి ప్రాజెక్టు 2017-18 అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు గానీ, సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు గా నీ కేంద్రం బాధ్యత వహించదని పరోక్షంగా తేల్చి చెప్పింది. నిధుల విషయంలోనే కాకుండా డయాఫ్రమ్‌ వాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణంలో డిజైన ్ల మార్పులను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదిస్తే తప్ప పోలవరం సాగు నీటి ప్రాజెక్టు నిర్వహణలోనికి రాదని కరాఖండిగా చెప్పేసింది.  పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ నిధులను కేంద్రం భరించదం టూ ‘‘పునరావాసానికి పైసా రాదు’’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. మరుసటి రోజే పార్లమెంటు వేదికగా ఇదే విషయాన్ని కేంద్రం తెల్చిచెప్పడం విశేషం. 2014 తర్వాత పెరిగిన అంచనా వ్యయాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిం చాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానంగా తేటతెల్లం చేశారు. అంటే 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకు పరిమితం కానున్నారు.


రాష్ర్టానికి తలకు మించిన భారమే!

పోలవరంపై తాజాగా కేంద్రం వెల్లడించిన అభిప్రాయంలో అత్యంత కీలకమైన రెండు అంశాలున్నాయి. ప్రధానమైనది 2017-18 అంచనా వ్యయం. ఈ అంచనా వ్యయం రూ.55, 656.87 కోట్లకు ఆమోదించేదే లేదని కేంద్రమంత్రి షెకావత్‌ చెప్పేశారు. కనీసం సవరించిన అంచనా వ్యయం రూ.47,725. 74 కోట్లకూ అంగీకరించేది లేదన్నారు. 2013-14 అంచనా వ్య యం రూ.20,398.61 కోట్లకు మాత్రమే పరిమితమవుతామని వెల్లడించారు. అంటే, దీనికంటే అధికంగా రూ.35,258.26 కోట్లు (55,656.87-20,398.61) రాష్ట్రం భరించాలి. ఇందులో 45.72 మీటర్ల కాంటూరుకు భూసేకరణ కోసం రూ.23,907.37 కోట్ల మేర వ్యయం అవుతుంది. కనీసం  సవరించిన అంచనా వ్య యం రూ.47,725.74 కోట్లను వ్యయం చేయాలన్నా రూ.27,327.13 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమేనా? అనే సందేహాలు నెలకొన్నాయి. 


సీడబ్ల్యూసీ సంతృప్తి చెందితేనే నీటి నిల్వ..

అందరూ నిధుల మంజూరు అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించారని, కానీ షెకావత్‌ ఇచ్చిన సమాధానంలో అత్యంత కీలకమైన.. మార్పు చేసిన డిజైన్లతో పనులు పూర్తి చేశాక సీడబ్ల్యూసీ సంతృప్తి చెందితే తప్ప గేట్లను కిందకు దించి నీటిని నిల్వ చేసేందుకు వీల్లేదని షెకావత్‌ వెల్లడించారు. ఇటీవల హెచ్‌కే పాండ్యా అధ్యక్షతన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌(డీడీఆర్‌పీ) కమిటీ సమావేశమై.. వర్షాల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులకు సంబంధించి కొన్ని సాంకేతికమైన సూచనలు చేసింది. గేట్ల బిగింపునకు సంబంధించి గడ్డర్ల బిగింపునకూ సాంకేతిక సలహాలు ఇచ్చింది. గ్యాప్‌-2 కాంక్రీట్‌డ్యామ్‌కు సంబంధించి సీడబ్ల్యూసీ కూడా కొన్ని సూచనలు చేసింది. డిజైన్లలో మార్పులు చేయాలని ఆదేశించింది. 


ఈ డిజైన్లను ఈ ఏడాది జూన్‌ 4న సీడబ్ల్యూసీకి పోలవరం ఇంజనీరింగ్‌ అధికారులు సమర్పించారు. వీటిపై ఇంకా సీడబ్ల్యూసీ అధ్యయనం చేసి సవరణలు సూచించడం గానీ, ఆమోదం గానీ తెలపలేదు. అప్రోచ్‌ చానల్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌, రాక్‌ఫిల్‌ డ్యామ్‌కు సంబంధించిన డిజైన్ల విషయంలోనూ కేంద్ర జల విద్యుత్‌ ప్రాజెక్టుల అధ్యయన సంస్థ(పుణె)కు పంపారు. పోలవరం ప్రాజెక్టు గట్లకు సంబంధించి భద్రతా చర్యల విషయంలో కాంట్రాక్టు సంస్థ డిజైన్లను సమర్పించాల్సి ఉంది. స్పిల్‌ చానల్‌కు సంబంధించి డిజైన్లలోనూ డీడీఆర్‌పీ సమావేశం నిర్ణయాల మేరకు మార్పులు చేయాలి. ఈ డిజైన్లన్నింటికీ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపాకే, గేట్లను దించి.. నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జల సంఘం అంగీకరిస్తుంది. అంతే కాకుండా.. ఈ డిజైన్లపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఆమోదం తెలపాల్సి ఉంటుందని షెకావత్‌ ప్రకటించారు. అంటే.. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత రాష్ట్రానిదైనా, నిర్వహణ మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జీఆర్‌ఎంబీ పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.  


‘పోలవరం’పై పాత అంచనాలే

2014 నాటి అంచనా వ్యయాన్నే భరిస్తాం: షెకావత్‌


న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): పోలవరం జాతీయ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు సంబంధించి పెరిగిన అంచనా వ్యయం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి వేసిన అంచనా వ్యయాన్ని మాత్రమే భరిస్తామని తేల్చిచెప్పింది. సోమవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మం త్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ మేరకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. పోలవరం హెడ్‌ వర్క్సు డిజైన్లలో జరిగిన మార్పుల కారణంగా హెడ్‌వర్క్సు నిర్మాణ వ్యయం రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని, నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు సంబంధించిన డి జైన్ల రూపకల్పన బాధ్యత కూడ ఏపీ ప్రభుత్వానిదేనని మం త్రి చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు గోదావరి జలాల ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ సీడబ్ల్యూసీ పరిశీలించి, ఆమోదించిన తర్వాతే వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్టులోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని, రెండో దశ కాంక్రీట్‌ పనులు నిర్వహణ అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి తెలిపారు.


పోలవరం అంచనా వ్యయాన్ని 55,656 కోట్లకు ఆమోదించాలి

నిర్మలా సీతారామన్‌కు వైసీపీ ఎంపీల వినతి


న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్విభజన చట్టానికి లోబడి, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు తాజాగా సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,656.87 కోట్ల వ్యయానికి తక్షణమే ఆమోదం తెలపాలని వైసీపీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ ఎంపీలంతా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. విభజన సందర్భంగా రాష్ర్టానికి ఇచ్చిన హామీలన్నీ కాలయాపన చేయకుండా నెరవేర్చాలని కోరుతూ ఎంపీల సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసి) కూడ ఆమోదించాయని మంత్రికి గుర్తు చేశారు. పోలవరానికి అవసరమైన భూ సేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ ప్రక్రియను నిర్దేశిత షెడ్యూలు ప్రకారం 2022 జూన్‌ నాటికి పూర్తి చే యాని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను వెంటనే రీయింబర్స్‌ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. 

Updated Date - 2021-07-27T08:01:22+05:30 IST