సమాచారం పారదర్శకంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-27T05:03:44+05:30 IST

‘‘ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని జిల్లా పోర్టల్‌ అందుబాటులో పెట్టండి... సమాచారం పారదర్శకంగా ఉండాలి... సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని ఇచ్చే బదులు మనమే ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచితే పోలా...’’ అంటూ కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రజావాణి కార్యక్రమంలో గౌతమ్‌ పాల్గొన్నారు. ప్రతీ ఫిర్యాదునూ కలెక్టర్‌ పరిశీలించారు.

సమాచారం పారదర్శకంగా ఉండాలి
ఫిర్యాదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

 జిల్లా పోర్టల్‌లో  శాఖల ముఖ్యసమాచారం అందుబాటులో ఉంచాలి

  ప్రజలకు అవసరమైన సమాచారం అందివ్వండి

 ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశం

ఖమ్మంకలెక్టరేట్‌, జూలై26: ‘‘ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని జిల్లా పోర్టల్‌ అందుబాటులో పెట్టండి... సమాచారం పారదర్శకంగా ఉండాలి... సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని ఇచ్చే బదులు మనమే ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచితే పోలా...’’ అంటూ కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో  కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రజావాణి కార్యక్రమంలో గౌతమ్‌ పాల్గొన్నారు. ప్రతీ ఫిర్యాదునూ కలెక్టర్‌  పరిశీలించారు. వారికి సమాధానం ఇవ్వడంతో పాటు సంబందిత అధికారులను ఈ సమస్యపై పరిష్కారానికి తగిన మార్గమేంటని ప్రశ్నించారు. ఇదే సందర్భంగా ఖమ్మం అర్భన్‌ మండలానికి చెందిన ప్రజలు పలు ఆరోపణలపై శ్రద్ధగా విన్న కలెక్టర్‌ ‘‘ జిల్లాలో అన్ని శాఖల ముఖ్య సమాచారం.. అదీ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని విధిగా పోర్టల్‌లో అన్‌లైన్‌ లో అందుబాటులో ఉంచేలా చూడాలని ఆదేశించారు. ఫిర్యాదు దారులు చెప్పే వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్‌ పలు మార్లు ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కారానికి సంబందిత అధికారులకు అక్కడికక్కడే ఫోన్‌ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ బి రాహుల్‌, డీఆర్వో శిరీష, జడ్పీ సీఈవో కొండపల్లి శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:03:44+05:30 IST