Advertisement

రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన ఉమ్మడి జిల్లా నాయకులు, అధికారులు

Oct 20 2020 @ 00:48AM

నిజామాబాద్‌ అర్బన్‌/కామారెడ్డి, అక్టోబరు 19: నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వెళుతూ మార్గమధ్యలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఆగి న రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథిని సోమవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అధికారులు కలిశారు. నిజామాబాద్‌ ఆర్‌అండ్‌బీ అ తిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న పార్థసారథిని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బి గాల గణేష్‌ గుప్తా మర్యాదపూర్వంగా కలిశారు. అలాగే నిజామాబాద్‌ పోలీస్‌ కమిష నర్‌ కార్తికేయ, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కూడా పార్థసారథిని కలిశారు. తిరుగు ప్రయాణంలో ఆయన సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. కలెక్టర్‌ శరత్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేoదర్‌లు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. 

Follow Us on:
Advertisement