దేశ నాయకులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-05-16T04:47:15+05:30 IST

దేశనాయకుల ఆశయాలను మనం నిత్యం స్మరించుకోవా లని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

దేశ నాయకులను స్మరించుకోవాలి
అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళ్లు అర్పిస్తున్న మంత్రి, ఎంపీ

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

- అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే విగ్రహాలు ఆవిష్కరించిన మంత్రి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల 

- గ్రామంలో విగ్రహాల ఏర్పాటు అభినందనీయం 


గోపాల్‌పేట, మే 15: దేశనాయకుల ఆశయాలను మనం నిత్యం స్మరించుకోవా లని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారం గ్రామంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణకు మంత్రితో పాటు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్టు పానుగంటి చంద్రయ్య, అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ సొమ్ము తో ఏర్పాటుచేసిన వివిధ రకాల పబ్లిక్‌ రంగ సంస్థలు ప్రజల కోసం ఉండాలని అంబేడ్కర్‌ చెప్పారని, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఒక దానికొకటి ప్రైవేటుపరం చేస్తున్నాయని తెలి పారు. అంబేడ్కర్‌ ముందుచూపుతో రాసిన రా జ్యాంగంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. పూలే సామాజిక వర్గాన్ని ముందుకు తీసుక రావడానికి పోరాటాలు చేశారని తెలిపారు. అంతకుముందు అంబేడ్కర్‌ విజ్ఞాన సంఘంను మంత్రి అభినం దించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌, మాజీ ఎంపీ మంద జగన్నాథం, సర్పంచ్‌ పద్మమ్మ, ఎం పీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అంబే డ్కర్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T04:47:15+05:30 IST